2023లో పేరెంట్స్ కానున్న సినిమా స్టార్స్ వీరే..

2022 పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పి వారం రోజులవుతోంది. ఈ వారం రోజుల్లోనే ఈ సంవత్సరం సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ ఏడాది సినిమా రిలీజ్‌లు ఏవి ఉండబోతున్నాయో కూడా దాదాపు తెలిసిపోయింది. అలానే ఈ ఏడాది తల్లిదండ్రులు కాబోతున్న సినీ ప్రముఖులు ఎవరో కూడా తెలిసిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే సినీ సెలబ్రెటీల భార్యలు గర్భవతులయ్యారు వారు ఇదే ఏడాదిలో గర్భం దాల్చుకున్నారు. అలా సినిమా వారిని తండ్రులను చేయనున్నారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

చెర్రీ-ఉపాసన 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ఈ ఏడాది తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. వివాహం జరిగిన 12 ఏళ్ల తరువాత ఉపాసన తల్లి కానుంది. ఈ సంతోషకరమైన వార్తను కొన్ని వారాల క్రితం మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “శ్రీ హనుమాన్ జీ ఆశీర్వాదంతో’ రామ్ చరణ్, ఉపాసన వారి మొదటి బిడ్డకు జన్మనివ్వబోతునందుకు మేం అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ప్రేమ, కృతజ్ఞతతో సురేఖ, చిరంజీవి కొణిదెల శోభన, అనిల్ కామినేని.” అని చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో రాసారు.

అట్లీ – ప్రియ

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్, అతని భార్య ప్రియా ఈ ఏడాది తమ మొదటి బిడ్డని ఈ ప్రపంచంలోకి తీసుకురాబోతున్నారు. ఈ సందర్బంగా ప్రియా ఇన్‌స్టాగ్రామ్‌లో “ఇప్పుడు వీ ఆర్ ప్రెగ్నెంట్. కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్, లవ్ మాకు కావాలి. ప్రేమతో మీ అట్లీ & ప్రియా ” అని ప్రకటించారు.

నిహ మర్ధా – ఆయుష్మాన్ అగర్వాల్

హిందీ సీరియల్స్‌లో పాపులర్ నటి నిహ మర్ధా, ఆమె భర్త ఆయుష్మాన్ అగర్వాల్ ఈ ఏడాది తమ మొదటి బేబీకి జన్మనివ్వబోతున్నారు. ఈ గుడ్‌న్యూస్ గురించి నిహ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వెల్లడించింది.

గౌహార్ ఖాన్ – జైద్ దర్భార్

హిందీలో బిగ్‌బాస్ 7 విన్నర్ గౌహార్ ఖాన్, ఆమె భర్త జైద్ దర్బార్ ఈ ఏడాది తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ సంతోషకరమైన వార్తని గౌహార్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అభిమానులతో పంచుకున్నారు.