బాల‌య్య‌ సింహం అయితే.. రిజల్ట్ వేరే లెవ‌ల్లో ఉంటుంది… ఇదే ప‌క్కా సాక్ష్యం…!

నందమూరి నట‌సింహ అంటూ సింహాన్ని తన బిరుదుగా ఎంచుకున్నాడు బాలకృష్ణ. అందుకు తగ్గట్టుగానే సింహం అని వచ్చేలా చాలా సినిమాల్లో నటించాడు. అందులోనూ కెరీర్ బెస్ట్ లో ఇండస్ట్రీ హిట్‌లు చాలానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వీర సింహారెడ్డి పేరుతో ఈ సంక్రాంతికి బాక్సాఫీసుస్‌ ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలోని ఇప్పటి వరకు బాలయ్య ఎత్తిన సింహ అవతారాలు ఏంటి వాటి సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం.

Simham Navvindi - Alchetron, The Free Social Encyclopedia

– ముందుగా బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి 1983లో సింహం నవ్వింది అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన ఫలితం అందుకోలేకపోయింది. కానీ ఎన్టీఆర్ పాత్రకు బాలకృష్ణ పాత్రకు మంచి పేరు వచ్చింది.

Bobbili Simham - Alchetron, The Free Social Encyclopedia

– 1994లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వ‌చ్చిన‌ ‘బొబ్బిలి సింహం’. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

Samarasimha Reddy : సమరసింహారెడ్డి కథ ఎలా పుట్టిందో తెలుసా? వారం రోజుల్లోనే  అది కూడా!! - Tolivelugu తొలివెలుగు

– ఫ్యాక్షన్‌ సినిమాలకు ఊపు తీసుకొచ్చిన సినిమా ‘సమర సింహా రెడ్డి’. 1999లో వచ్చిన ఈ సినిమాలో బాలయ్యను దర్శకుడు బి.గోపాల్‌ ఫుల్‌ మాస్‌ మోడ్‌లో చూపించారు. బాలకృష్ణ సరసన సిమ్రాన్, అంజలా ఝవేరి, సంఘవి న‌టించారు ఈ సినిమా బాల‌య్య కెరీర్‌లోనే ఇండ‌స్ట్రీ హిట్ కోట్ట‌డు.

Narasimha Naidu(నరసింహ నాయుడు) Telugu Full Movie | Balakrishna, Simran,  Preeti Jhangiani - YouTube

– బాలయ్య – బి.గోపాల్‌ కాంబినేషన్‌లో 2001లో వచ్చిన సినిమా ‘నరసింహనాయుడు’. ఈ సినిమా విజయం గురించి ఎంత చెప్పానా తక్కువే. 2001లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఈ సినిమాలో సిమ్రాన్, ప్రీతి జింగానియా, ఆశాషైనీ హీరోయిన్లు. బాల‌య్యకు తిరుగులెని హిట్‌గా నిలిచింది.

Watch Seema Simham | Prime Video

– సీమ సినిమాలతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే బాలయ్య 2002లో ‘సీమ సింహం’గా వచ్చారు. బాలకృష్ణకు జ‌టంగా సిమ్రాన్, రీమా సేన్ నటించారు. జి.రామ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సరైన ఫలితం అందుకోలేకపోయింది.

Simha - Disney+ Hotstar

– బాలకృష్ణ రీసెంట్‌ బ్లాక్‌బస్టర్స్‌ లిస్ట్‌లో తొలి స్థానాల్లో ఉండే సినిమా ‘సింహ’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2010లో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార, నమిత, స్నేహ ఉల్లాల్‌ నటించారు. ఈ సినిమా బాల‌య్య‌కు తిరిగి మ‌ళ్ళి త‌న స్టార్ డ‌మ్‌ను తెచ్చిపెట్టింది.

Lakshmi Narasimha telugu | Sun NXT

– తమిళంలో మంచి విజయం అందుకున్న ‘సామి’ సినిమాను తెలుగులో ‘లక్ష్మీ నరసింహ’గా తీసుకొచ్చారు బాలయ్య. 2004లో వచ్చిన ఈ సినిమాలో అశిన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కూడా బాల‌య్య‌కు మంచి విజ‌యాని అందిచింది.

Lion (2015) - IMDb

– తెలుగు సింహాలతోపాటు బాలయ్య ఇంగ్లిష్ ల‌య‌న్‌లో కూడా నటించారు. 2015లో ‘లయన్‌’ పేరుతో ఓ సినిమా లో న‌టించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టే నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఆశించిన విజయం అందుకోలేదు.

Jai Simha Pre-Release Business | Box Office Andhra

– కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో ‘జై సింహా’ టైటిల్‌తో 2018లో బాలయ్య ఓ సినిమా చేసారు. బాలయ్య సరసన ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటించింది. ఈ సినిమా సంక్రాంతి కి వ‌చ్చి బాల‌య్య‌కు మంచి విజయాన్ని అందించింది.

– గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమా చేశాడు. ఈ సినిమాను జనవరి 12న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్‌ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించింది. ఇప్పుడు వరకు బాలకృష్ణ సింహం అనే పేరుతో పది సినిమాల్లో నటించారు వాటిలో సగానికి పైగా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.