కోటులో య‌మా హాట్‌గా ద‌ర్శ‌న‌మిచ్చిన కాజ‌ల్.. వింట‌ర్ లోనూ చెమ‌ట‌లు ప‌ట్టించేసింది!

టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన‌ అందాల భామ కాజల్ అగర్వాల్.. హీరోయిన్ గా ఆఫర్లు వస్తున్న సమయంలోనే ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. వివాహం అనంతరం పెద్దగా సమయం తీసుకోకుండా వెంటనే గర్భం దాల్చిన కాజ‌ల్‌.. గత ఏడాది ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది.

తనయుడికి ఆరు నెలలు దాటిన వెంటనే ఫిట్నెస్ పై శ్రద్ధ వ‌హించి రీఎంట్రీకి సిద్ధమైంది. ఆల్రెడీ ఈ బ్యూటీ `ఇండియన్ 2` సినిమాలో నటిస్తోంది. పెళ్లికి ముందే ఈ ప్రాజెక్టుకు సైన్ చేసింది.

శంకర్‌, కమల్ హాసన్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఈ మూవీ తో పాటు కాజల్ మరికొన్ని కొత్త ప్రాజెక్టులను సైతం లైన్లో పెడుతోంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అదిరిపోయే ఫోటోషూట్లతో ఆగ‌మాగం చేస్తోంది.

తాజాగా కోటులో య‌మా హాట్ గా దర్శనం ఇచ్చి.. వింట‌ర్ లోనే చెమటలు పట్టించింది. వైట్ టాప్, ప్యాంట్ ధరించిన కాజల్ దానిపై పింక్ కోట్ వేసుకుని హ‌య‌లు పోతూ ఫోటోల‌కు పోజులు ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.