మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. న్యూ ఇయర్ వేడుకలకు గోవా చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ వేడుకల్లో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమన్నా సోషల్ మీడియాలో హైలెట్ గా మారింది. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. ఇప్పుడు తాజాగా తమన్నా తన సోషల్ మీడియాలో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఫొటోస్ ని ఇప్పుడు అభిమానులతో పంచుకుంది.
తమన్నా ఆ పోటోలు కింద ఇవిధంగా రాస్తు.. కొత్త సంవత్సరంలోకి ట్వంటీ ట్వంటీ ఫ్రీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అ పోటోలో ఎక్కడా తన ప్రియుడిని రివీల్ చేయకుండా జాగ్రత్తపడింది. బీచ్ లో తమన్నా హంగామా చూస్తే మైండ్ బ్లాక్ కావలసిందే. పలచని షర్ట్ ధరించి ఇసుకలో దొర్లుతూ లోదుస్తులతో మంటలు పుటిస్తుంది. ఏది ఏమైనా తమన్నా ఫోటోస్ నెటిజన్లని ఎంతో ఆకట్టుకుంటూ వైరల్ గా మారాయి.
తమన్నా పోస్టుపై సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అ పోటోలు కింద ప్రియుడు విజయ్ వర్మ ఎక్కడ అంటూ కామెంట్లు పెడుతున్నారు. విజయ్‌తో ఉన్న పోటోలు షేర్ చేయండి అంటూ మరోకరు ప్రశ్నించారు. మరికోందరు నీ లవర్ ఎక్కడ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తమన్నా గతంలో చిరంజీవితో సైరా సినిమాలో నటించింది. అయితే అది ఫుల్ లెన్త్ హీరోయిన్ పాత్ర కాదు. భోళా శంకర్ చిత్రంలో తమన్నా పూర్తి స్థాయిలో హీరోయిన్ గా నటించనుంది. దీనితో మెగాస్టార్, మిల్కీ బ్యూటీ జోడి వెండితెరపై ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.