ప్రముఖ నటుడు గోపీచంద్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఈ మధ్య గోపీచంద్ నటించిన సినిమాలు అన్ని ప్లాప్ అవుతూ ఆయన అభిమానులకు నిరాశను మిగిలిస్తున్నాయి. అయితే ఆయన నటించిన కొన్ని సినిమాలు కథ పరంగా బాగానే ఊన్నా కూడా కరెక్ట్ టైమ్‌లో రిలీజ్ కాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. ఇక ప్రస్తుతం గోపీచంద్, శ్రీవాస్ దర్శకత్వంలో తెరకేక్కబోతున్న ‘రామబాణం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
ఇక ఇటీవలే గోపీచంద్ అన్‌స్టాపబుల్-2కి గెస్ట్‌గా హాజరయ్యారు. అంతేకాకుండా, ఈ అన్‌స్టాపబుల్ షోలో కాన్సర్‌తో బాధపడుతున్న ఒక చిన్నారికి గోపీచంద్ తన నెక్స్ట్ మూవీలో పాట పడే అవకాశాన్ని ఇచ్చారు. లక్ష్మి మనోజ్ఞ అనే చిన్నారికి గోపీచంద్ సహాయం చేసారు. ప్రస్తుతం ఆయన చేసిన సహాయం హాట్ టాపిక్‌గా మారింది. అందరూ గోపీచంద్ చాలా మంచి వాడు అని, ఆయన మనసు చాలా మంచిది అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి లక్ష్మి మనోజ్ఞకి బసవతారకం హాస్పిటల్‌లో ఉచితంగా వైద్య చికిత్స అందించడానికి బాలకృష్ణ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే బాలయ్య షోలో పాల్గొన్న లక్ష్మి మనోజ్ఞ వాయిస్ మంచిగా ఉండడం తో ఆమె మంచి సింగర్ అవుతుంది చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ ఎపిసోడ్‌లో గోపీచంద్‌తో పాటు డార్లింగ్ ప్రభాస్ కూడా అన్‌స్టాపబుల్ షోకి హాజరై బాలయ్యతో ముచ్చటించారు. ఈ ఎపిసోడ్ ద్వారా ప్రభాస్, గోపీచంద్‌కి సంబంధించిన విషయాలు చాలానే తెలుసుకోవచ్చని ప్రేక్షకులకు ఎదురుచూశారు. కానీ వారు ఊహించినంతగా ఏమి లేదని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గత ఎపిసోడ్స్ అంత ఇంట్రెస్టింగ్ గా ఈ ఎపిసోడ్ లేదని అంటున్నారు కొంతమంది. అంతేకాకుండా, చాలా మంది పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. అది ఎప్పుడు విడుదల చేస్తారు అనే దాని గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.