ఎన్టీఆర్ ఉంటే షూటింగ్ కే రానంటూ మొండికేసిన స్టార్ హీరోయిన్..!

తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పటికీ మర్చిపోలేని అగ్ర నటులలో ఎన్టీఆర్, శ్రీదేవి ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. సినీ ప్రేక్షకులకు ఈ జంట అందించిన వినోదం గురించి ఎంత చెప్పకున్నా తక్కువే అవుతుంది. అప్పట్లో వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటేనే థియేటర్లు ఖాళీ ఉండేవి కావు.. ఎన్టీఆర్- శ్రీదేవి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.

Andhaala Hrudayamaa Full Video Song || Anuraga Devatha Movie || N.T.R,  Sridevi - YouTube

ఇక వీళ్ళ విషయంలో ఎన్నో రూమర్లు కూడా వచ్చేవి. అయినా వారు వాటిని పట్టించుకోకుండా వారి పని వారు చేసుకుంటూ వెళ్లిపోయేవారు. ఇక సినిమాల షూటింగ్ సమయంలో ఎన్టీఆర్- శ్రీదేవిని ఆట పట్టించే విధానం కూడా ఆ రోజుల్లో ఎంతో ఫన్నీగా ఉండేది.. ఎందరో అగ్ర దర్శకుల కాంబినేషన్లో వీరిద్దరూ కలిసి సినిమాలు చేశారు. ఎన్టీఆర్‌కు తెలుగు అంటే ఎంతో ఇష్టం ఎంతో మక్కువ ఉండేది.

ఎన్టీఆర్ తో శ్రీదేవి..అప్పట్లోనే రికార్డ్ ! | Sridevi memorable movies with  NTR - Telugu Filmibeat

అందుకనే ఆయన సినిమాలో చెప్పే డైలాగుల్లో ఎక్కడ ఆంగ్ల పదాలు రానివ్వకుండా చూసుకునేవారు. ఆయన నటించే సినిమాల్లో హీరోయిన్లకు కూడా డబ్బింగ్ చెప్పే సమయంలో కూడా గమనించి ఆంగ్ల పదాలను లేకుండా చూసేవారు. ఇక దీనివల్ల ఎన్టీఆర్ తో సినిమా తీయాలంటే డైలాగ్ రైటర్లు ఎంతో ఇబ్బంది పడేవారట.దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు వంటి అగ్ర దర్శకులు అయితే ఎన్టీఆర్‌కు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసేవారట.

NTR- Sridevi: శ్రీదేవి జీవితంలో ఎన్టీఆర్ చెప్పిందే జరిగింది.. ఇంతకీ ఏమిటో  తెలుసా అది ? - OK Telugu

ఇక ఎన్టీఆర్, శ్రీదేవితో సినిమా చేసే సమయంలో షూటింగ్ స్పాట్ ఎంతో ఆహ్లాదంగా ఉండేదట. ఇదే సమయంలో శ్రీదేవి డబ్బింగ్ చెప్పే సమయంలో ఎన్టీఆర్ కామెడీ చేసేవారట. ఆమెను కాస్త ఆట పట్టించే వారట.. ”కాస్త గట్టిగా తింటే డైలాగ్ బలంగా వస్తుంది అంటూ.. ఆ కీచు గొంతు వేసుకొని డైలాగ్ చెబుతున్నావ్ అంటూ కామెంట్ చేసే వారట”.

తనతో నటిస్తున్న శ్రీదేవి జాతకాన్ని ఎన్టీఆర్ ఎందుకు తెప్పించారు | Sr ntr  intresting comments about sridevi details, nanamuri taraka rama rao,  heroine sridevi, sri devi astrology, badu pantulu movie ...

ఈ క్ర‌మంలోనే ఒక్కొక్కసారి శ్రీదేవి.. ఎన్టీఆర్ మీద అలిగి డబ్బింగ్ థియేటర్ నుంచి బయటకు వెళ్లి పోయేదట. దర్శక నిర్మాతలు ఆమెకు నచ్చజెప్పిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. శ్రీదేవి కూడా ”ఎన్టీఆర్ ఉంటే డబ్బింగ్ చెప్పను అనే కండిషన్లు పెడుతూ సినిమా షూటింగ్ కి వచ్చేదట”. ఈ రకంగా ఎన్టీఆర్- శ్రీదేవిని షూటింగ్ సమయంలో ఆటపట్టించేవాడు.