మెగా ఫ్యాన్స్ బీ అలెర్ట్: వాల్తేరు వీరయ్య ఫ్లాప్ అయితే..నెక్స్ట్ చిరంజీవి చేసే పని ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలోనే ఎన్నడూ లేని విధంగా ముగ్గురు బడా హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సంక్రాంతికి టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు . దీంతో ముగ్గురు హీరోల అభిమానులు కూడా తమ ఫేవరెట్ హీరో సినిమా హిట్ అవ్వాలని పూజలు చేస్తూ సోషల్ మీడియాలో నానాహంగామ చేస్తున్నారు. అయితే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వారసుడు సినిమా ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలలో సక్సెస్ అవ్వలేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు .

 

ఇప్పుడు బిగ్ టఫ్ ఫైట్ మొత్తం నందమూరి బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి .. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలు మధ్యనే ఉంది . ఈ క్రమంలోనే మరోసారి సోషల్ మీడియాలో మెగా వ్స్ నందమూరి వార్ ఊపందుకుంది . ఇప్పటివరకు సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చలు ప్రకారం ..రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ,టీజర్, ట్రైలర్ ,పోస్టర్స్ ఆధారంగా వాల్తేరు వీరయ్య కంటే వీరసింహారెడ్డి సినిమాకి ఎక్కువ పాజిటివ్ కామెంట్స్ దక్కాయి . బాలయ్య ఈ సినిమాల్లో మాస్ హీరోగా లుంగీ కట్టి ఇండస్ట్రీనీ ఊపు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు .

అదేవిధంగా .. వాల్తేరు వీరయ్య కూడా పాజిటివ్ కామెంట్స్ దక్కించుకుంటుంది . ఎక్కడ తగ్గేదే లేదు అన్న విధంగా చిరంజీవి సైతం సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటూ.. సినిమాకి కొత్త బజ్ క్రియేట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది . కావాలనే కొందరు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాను టార్గెట్ చేసి నెగిటివ్ కామెంట్స్ చేసి ఫ్లాప్ చేయాలని చూస్తున్నారని.. మెగా ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొస్తున్నారు .

ఒకవేళ నిజంగా మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమా ఫ్లాప్ అయితే మెగాస్టార్ చిరంజీవికి ఏమి బాధపడరు. ఇన్నాళ్ల తన కెరియర్లో ఎన్నో హిట్ సినిమాలు చూశాడు కొన్ని కొన్ని ఫ్లాప్ సినిమాలు చూశాడు . దానికి డబుల్ వేగంతో హిట్లందుకుంటాడు. ఒకవేళ నిజంగా వాల్తేరు వీరయ్య సినిమా ఫ్లాప్ అయినా లేక కలెక్షన్స్ అటూ ఇటూ అయినా చిరంజీవి తన నెక్స్ట్ సినిమా భోలాశంకర్ తో ఆ లెక్కలను సరి చేస్తాడని.. కొందరు మెగా ఫాన్స్ చెబుతున్నారు. ఏది ఏమైనా సరే సోషల్ మీడియాలో మెగాస్టార్ పై నెగిటివ్ ట్రోలింగ్ ఎక్కువవుతున్న తరుణంలో మెగా ఫాన్స్ కొంచెం అలర్ట్ గా ఉండడమే బెటర్ అన్నది సినీ విశ్లేషకులు అభిప్రాయం..!!