మహేష్ న్యూ మూవీ అప్డేట్.. ఇది నిజమేనా..!?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబోలో తన 29వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే తన కుటుంబంలో జరిగిన వరుస విషాదాల నుంచి కోలుకున్న మహేష్ వర్క్ మూడ్ లోకి వెళ్లిపోయాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ విషయంలో చాలా అంతరాయం రావడంతో అనుకున్న సమయానికి సినిమా షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులో తన పుట్టినరోజు కానుకగా ఈ సినిమాను ప్రేక్షకులు ముందు తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే దర్శక ధీరుడు రాజమౌళితో తన 30వ సినిమా షూటింగ్‌లో బిజీ అవనున్నాడు. అయితే ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగా త్రివిక్రమ్ సినిమా ఆయన వెంటనే రాజమౌళి సినిమా మొదలయ్యే అవకాశం లేదు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఇప్పటికీ రాజమౌళి త్రిబుల్ ఆర్ ఆస్కార్ పనుల మీద విదేశాల్లోనే ఉన్నాడు. ఆయన తిరిగి వచ్చాక కానీ ఈ సినిమా గురించి ఆలోచించే పరిస్థితి లేదు. దీన్ని బట్టి చూసుకుంటే మహేష్‌తో సినిమా వెంటనే మొదలయ్యే అవకాశం లేదు అంటున్నారు.

ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా అయిన వెంటనే మహేష్ మరో సినిమా చేసి ఆ తర్వాత రాజమౌళి సినిమాకు వెళ్లాలని భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా కథ‌లు కూడా వింటున్నట్టు టాక్ వినిపిస్తుంది. రాజమౌళితో సినిమా అంటే కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాలు బిజీ అయిపోవాలి.. అన్ని సంవత్సరాలు ఖాళీగా ఉండటం కన్నా ఆ సినిమా స్టార్ట్ అయ్యే లోపే మరో సినిమా చేసి ఫ్యాన్స్ ని ఖుషి చేయాలని మహేష్ ప్లాన్‌ట.. మరి ఈ వార్త నిజమై మహేష్ ఇంకో సినిమాకు ఓకే చెప్తే మాత్రం ఏ దర్శకుడు తో సినిమా చేస్తాడనేది చూడాలి.