పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. సౌత్ తో పాటు నార్త్ లోను బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంది. సౌత్ లో స్టార్ హోదాను అనుభవిస్తున్న ఈ భామ నార్త్ లోనూ సత్తా చాటాలని భావించింది. కానీ బాలీవుడ్ లో రష్మికతో బ్యాడ్ టైమ్ బంతాడేస్తోంది.
ఆల్రెడీ రష్మిక నటించిన `గుడ్ బై` చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల నడుమ వచ్చి ఘోరంగా బోల్తా పడింది. తాజాగా మరో సినిమాతో రష్మిక నార్త్ ప్రేక్షకులను పలకరించింది. అదే `మిషన్ మజ్ను`. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా శంతను బాగ్చి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న స్పై థ్రిల్లర్ మూవీ ఇది. ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం నేరుగా విడుదలైంది.
కానీ, ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా విఫలం అయింది. ఈ సినిమాతో రష్మికకు బాలీవుడ్ లో మరో ఫ్లాప్ పడింది. మిషన్ మజ్ను మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని రష్మిక ఎంతో ఆశపడింది. అయితే ఫైనల్ గా ఆమెకు నిరాశే ఎదురైంది. రెండో సినిమా కూడా పోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో రణ్‌బీర్ కపూర్ తో `యానిమల్` అనే సినిమా చేస్తుంది. ఒకవేళ ఈ సినిమా రిజల్ట్ సైతం తేడా కొడితే.. బాలీవుడ్ లో రష్మిక కెరీర్ క్లోజ్ అవ్వడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.