ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్ ఫర్ ఆస్కార్స్‌.. హాలీవుడ్ మీడియాలో రచ్చ!!

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆస్కార్ అవార్డుల హడావుడి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది మార్చిలోనే ఈ అవార్డ్స్ వేడుక జరగనుంది. ప్రస్తుతం అకాడమీ సభ్యులు ఆస్కార్ అవార్డ్స్ కోసం అన్ని కేటగిరీలలో బెస్ట్ సినిమాలు, మ్యూజిక్ వీడియోలను షార్ట్ లిస్ట్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఈసారి మన ఇండియన్‌ సినీ సెలబ్రిటీలలో ఆస్కార్ అవార్డ్స్ ఎవరిని వరించబోతుందనే ప్రశ్న ఎక్కువగా తలెత్తుతోంది. అయితే ఈ ఏడాది ఆస్కార్ అవార్డు ఆర్ఆర్ఆర్ సినిమాని కచ్చితంగా వరించే అవకాశాలు ఉన్నాయని సినిమా ప్రేమికులు గట్టిగా నమ్ముతున్నారు. అందుకోసమే రాజమౌళి అమెరికాకి వెళ్లి ఆర్ఆర్ఆర్ సినిమా గురించి హాలీవుడ్‌లో ఒక రేంజ్ లో ప్రచారం చేశారని వీరు చెబుతున్నారు.

ఇక ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాని గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. అలానే రకరకాల కేటగిరీలలో ఆస్కార్ అవార్డులను ఆర్ఆర్ఆర్ సినిమా దక్కించుకోవాలి అని రాజమౌళి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఇక మన టాలీవుడ్ సిని ప్రేమికులు కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు రావాలని కోరుకుంటున్నారు. దీనికిగాను కొంతమంది ట్విట్టర్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమాని ట్రెండ్ చేస్తున్నారు.

హాలీవుడ్ న్యూస్ సైట్ యూఎస్ఎ టుడే తాజాగా బెస్ట్ యాక్టర్స్‌గా ఒక పది మంది పేర్లను ఆస్కార్ అవార్డు కోసం కన్సిడర్ చేయాలని పోస్ట్ చేసింది. ఆ పది పేర్లలో ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా ఉంది. దాంతో మన టాలీవుడ్ అభిమానులు ఆనందానికి హద్దులు లేవు. ఈ సందర్బంగా అభిమానులు ఎన్టీఆర్ ఫర్ ఆస్కార్ అని ట్యాగ్ తో ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు.