బాబాయ్ చేసిన పనికి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్న ఎన్టీఆర్.. అసలేం జరిగింది..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి తారక రామారావు ఇటు సినిమాలను అటు రాజకీయాలలో తిరుగులేని ముద్రవేసి తెలుగు వారి ఖ్యాతిని నలుమూల చాటారు. ఆయన తర్వాత ఆ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా చిత్ర పరిశ్రమంలో అడుగు పెట్టినప్పటికీ.. ఆయన కొడుకు బాలకృష్ణ మరియు మనవుడు జూ.ఎన్టీఆర్ మాత్రమే చిత్ర పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే సమయంలో నందమూరి కుటుంబం నుంచి ఆయనకు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ తన నటనతో టాలీవుడ్ లోనే తిరుగులేని హీరోగా గుర్తింపు తెచ్చుకుని ఈ తరం నటులలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. ఇక గత సంవత్సరం వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. తన నటనకు గాను ఎన్టీఆర్ ఆస్కార్ కు ఎంపికయ్యాడు.

Happy Birthday NBK| Jr NTR wishes uncle Nandamuri Balakrishna on his  birthday with throwback picture; writes 'the first hero'

అయితే ఇప్పుడు గతంలో ఒక అవార్డు ఫంక్షన్ లో ఎన్టీఆర్ తో పాటు నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. ఆ సమయంలోనే బాలకృష్ణ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఓ ఫిల్మ్‌ఫేర్ అవార్డు ఫంక్షన్ లో పాల్గొన్న ఎన్టీఆర్ అక్కడ తన బాబాయ్ బాలకృష్ణ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. బాల‌య్య బాబాయ్ చేతుల మీదుగా అవార్డు అందుకోవటంతో ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ అయ్యాడు.

అదే సమయంలో ఎన్టీఆర్ బాలకృష్ణ గురించి మాట్లాడుతూ..’అందరూ మా బాబాయి గురించి ఎన్నో విధాలుగా చెబుతూ ఉంటారు కానీ నేను ఆయన గురించి ఒకే ఒక మాట చెబుతాను ఆయన నడిచే ఒక విజ్ఞాన గని.. అనే మాట ఆయనకు కరెక్ట్ గా సరిపోతుంది’.. అంటూ బాలకృష్ణ గురించి ఎంతో గొప్పగా వ్యాఖ్యానించాడు.ఎన్నో సంవత్సరాలుగా నందమూరి కుటుంబానికి దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ ఇలా మాట్లాడటంతో బాలయ్య కూడా ఒక్కసారిగా ఎమోషనల్ అయి ఎన్టీఆర్ భుజం మీద చేతులు వేసి ఆనందంతో గుండెలకు హత్తుకున్నాడు.

ఇలా ఒకేసారి ఇద్ద‌రు అభిమాన హీరోలు ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయాయి. ఆ అరుదైన దృశ్యాన్ని చూసి ఇలలు వేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ఇలా ఒక్కసారిగా బాలయ్య ఆప్యాయంగా ఎన్టీఆర్ ను దగ్గరకు తీసుకోవడంతో ఆయన చాలా ఎమోషనల్ ఐ అందరూ ముందు ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.