`వీర సింహారెడ్డి` బ్రేక్ ఈవెన్ కాలేదా..? ఇంకా ఎంత వ‌స్తే క్లీన్ హిట్ అవుతుంది?

ఈ సంక్రాంతి పండక్కి విడుదలైన చిత్రాల్లో `వీర సింహారెడ్డి` ఒకటి. గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదలైంది.

మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబట్టింది. కానీ, ఇంతవరకు బ్రేక్ ఈవెన్‌ మాత్రం కాలేదు. ఈ చిత్రానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 73 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. రూ. 74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దూకిన ఈ చిత్రం.. విడుద‌లైన తొమ్మిది రోజుల్లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రూ. 60.98 కోట్ల షేర్‌, రూ. 98.60 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను అందుకుంది.

అలాగే వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 71.14 కోట్ల షేర్‌, రూ.119.25 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఈ చిత్రం రూ. 2.86 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అప్పుడే ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ అవుతుంది. ఇక రెండో వారం కంప్లీట్ అయ్యే స‌మ‌యానికి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవుతుంద‌ని ఫ్యాన్స్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.