పెళ్లిపై యాంకర్ ప్రదీప్ ఎట్టకేలకు నోరు విప్పాడు… ఏమన్నాడంటే..?

ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తన తోటి యాంకర్లందరికీ ఆల్రెడీ పెళ్లయిపోయి పిల్లలు పుట్టినప్పటికీ ఇతడు మాత్రం సింగిల్ లైఫ్ చేస్తున్నాడు. చాలాకాలంగా ప్రదీప్ పెళ్లి గురించి రకరకాల వార్తలు కూడా పుట్టుకొస్తున్నాయి. దాంతో ప్రదీప్ పెళ్లి విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గా ఉంటుంది. కాగా ప్రదీప్ కూడా తన పెళ్లి గురించి వీలు చిక్కినప్పుడల్లా స్పందిస్తూ ‘ఇప్పుడే పెళ్లి చేసుకొనని’ ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తుంటాడు.

అయితే తాజాగా ప్రదీప్ ప్రముఖ స్టైలిస్ట్ నవ్య మారోతును పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త వైరల్ అయింది. ఈ విషయంపై ప్రదీప్, నవ్య ఇద్దరూ స్పందించలేదు. దాంతో అందరూ వారిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారని నమ్మారు. ఇక వారిద్దరి పెళ్లి విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘లేడీస్ అండ్ జంటిల్ మన్ ‘అనే షోలో పాల్గొన్న ప్రదీప్ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు. ఆ షోకి గెస్ట్ గా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె మాట్లాడుతూ ‘నీ పెళ్లి గురించి ఒక వార్త నాలుగైదురోజుల నుంచి చూస్తునాను, ప్రదీప్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా ‘ అని అడుగుతారు. దానికి వెంటనే ప్రదీప్ స్పందించి ‘ ఆ అమ్మాయి ఎవరో చూస్తే నేను షాక్ అవుతాను సార్’ అంటూ అతని పెళ్లి గురించి వస్తున్న వార్తలను ఖండించాడు.

సోషల్ మీడియాలో నా పెళ్లి గురించి న్యూస్ చూసి నేను షాక్ అయ్యాను అని ప్రదీప్ చెప్పారు. ప్రదీప్ మాట్లాడం అయిపోగానే ‘లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్’ షోలో ప్రదీప్ పెళ్లి గురించి ఒక పాటను పేరడి చేసి వినిపించారు. ఏదయితేనేం చివరికి నవ్యతో తన పెళ్లి ఫిక్స్ కాలేదని ఒక క్లారిటీ ఇచ్చాడు ప్రదీప్ మాచిరాజు.