చిత్ర పరిశ్రమలో ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఎవరికి ఎక్కడ అవకాశం వస్తుందో ఎవరు చెప్పలేరు. హీరోలు, నటులు కావాలని పరిశ్రమలో అడుగుపెట్టిన వారు దర్శకులుగా మారి కెరీర్ లో దూసుకుపోతున్నారు. మరి కొంతమంది అనుకున్నది సాధించలేక నిరుత్సాహంతో వెన్ను తిరిగి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు దర్శకులు కావాలని హీరోలుగా మారి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్లగా కొనసాగుతున్న కొంతమంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్న మాస్ మహారాజ రవితేజ కూడా దర్శకుడుగా తన కెరీర్ను మొదలుపెట్టి కృష్ణవంశీ, రాఘవేంద్రరావు వంటి పలువురు దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి..ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని కూడా డైరెక్టర్ అవ్వాలని చిత్ర పరిశ్రమంలో అడుగుపెట్టి సీనియర్ దర్శకులు బాబు, రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఇప్పుడు టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.
మరో యంగ్ హీరో నిఖిల్ కూడా చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా, సినీ జర్నలిస్టుగా పనిచేసీ ఇప్పుడు తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్లో సినిమాల్లో నటిస్తూ బిజీగా కొనసాగుతున్నాడు. సీనియర్ హీరో జీడి చక్రవర్తి కూడా ముందుగా సంచల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి తర్వాత హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్నాడు.
ఇక మరో హీరో సిద్ధార్థ్ కూడా ముందుగా దర్శకుడుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి మణిరత్నం, శంకర్ వంటి అగ్ర దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. మరో యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్గా చిత్ర పరిశ్రమకు పరిచయమై తర్వాత హీరోగా తన కెరీర్ని కొనసాగిస్తున్నాడు. తెలుగు స్టార్ కమెడియన్ సునీల్ కూడా ముందుగా స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఆ తర్వాత స్టార్ కమెడియన్ గా ఇప్పుడు స్టార్ విలన్ గా చిత్ర పరిశ్రమంలో కొనసాగుతున్నాడు.
మరో స్టార్ కామెడియన్ సప్తగిరి కూడా దర్శకుడుగా అవ్వాలని చిత్ర పరిశ్రమంలో అడుగుపెట్టి.. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేసి ఇప్పుడు.. ఎవరు ఊహించని విధంగా స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. మరో నటుడు కమ్ దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కూడా ముందుగా సహాయ దర్శకుడుగా పరిచయమై తర్వాత దర్శకుడుగా సినిమాలు చేసి నటుడుగా టాలీవుడ్ లో కొనసాగుతూ తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు.