“ఊ అంటావ మావ” కి మొదట అనుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..బన్నీ నే రిజెక్ట్ చేశాడు..!!

“పుష్ప ..పుష్ప రాజ్..నీ యవ్వ తగ్గేదేలే” ఈ డైలాగ్ గత కొంతకాలంగా ఎలా మన డైలీ లైఫ్ లో భాగమైపోయిందో అందరికీ తెలిసిందే. మనలో కూడా చాలామంది రోజుకి ఒక్కసారైనా ఈ డైలాగును మన డైలీ రొటీన్ లో వాడుతూనే ఉంటాం . అంతలా జనాల్లోకి దూసుకెళ్లిపోయాడు పుష్ప రాజ్.. అదేనండి మన స్టైలిష్ స్టార్ బన్నీ . డిసెంబర్ 17న 2021 గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా పుష్ప. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోగా బన్నీ జీవించేసాడు.

ఈ సినిమా ఎన్ని రికార్డులను కొల్లగొట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నటించిన తర్వాత హీరోయిన్ రష్మిక మందన కు ఆ క్రేజ్ దక్కింది. అంతేకాదు బన్నీ , సుకుమార్ సైతం తమకున్న పాపులారిటీని డబుల్ చేసుకున్నారు . అయితే ఎవ్వరు ఊహించిన విధంగా ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైప్ తీసుకొచ్చిన పాట మాత్రం ఐటమ్ సాంగ్ అనే చెప్పాలి. కెరియర్ లోనే ఫస్ట్ టైం సమంత ఐటమ్ సాంగ్ “ఊ అంటావా మావ” ఇప్పటికి మన ఫోన్లో మారు మ్రోగి పోతూనే ఉంటుంది.

ఏ ఫంక్షన్ అయినా.. ఏ ఈవెంట్ అయినా ..ఈ పాట ఉండాల్సిందే.. నడుము ఊపాల్సిందే . అంతలా జనాలకు కనెక్ట్ అయింది ఈ పాట . ఈ సినిమాలో మొదట ఐటెం సాంగ్ అనుకోగానే సుకుమార్ స్టార్ హీరోయిన్ తమన్నా ని మైండ్ లో ఊహించుకున్నాడట . బన్నీ – తమన్నా హాట్ స్టెప్స్ చేస్తే జనాలు కచ్చితంగా కనెక్ట్ అవుతారు అంటూ అభిప్రాయపడ్డారట . అయితే పాట విన్నాక..అప్పటికే విడాకులు ప్రకటించిన సమంత అయితే ఈ పాటకి కరెక్ట్ గా సూట్ అవుతుందని భావించాడట . ఇదే విషయాన్ని బన్నీకి చెప్పగా మొదట తమన్నా కి ఓకే అన్న బన్నీ.. ఆ తర్వాత వెంటనే ఆమెను రిజెక్ట్ చేసి సమంతకు స్పెషల్ గా కాల్ చేసి ఈ పాటకు ఊ కొట్టేలా ఫోర్స్ చేశాడట . ఏది ఏమైనా సరే సమంత కెరియర్ లోనే ఫస్ట్ టైం నటించిన ఈ ఐటెం సాంగ్ ఇప్పటికీ ఇండియాని షేక్ చేస్తుంది అనడంలో సందేహం లేదు . చూడాలి మరి రానున్న రోజుల్లో సమంత నుంచి ఎలాంటి సాంగ్స్ రాబోతున్నాయో..?

Share post:

Latest