ఆ హీరోని నమ్మి నిండా మునిగిపోయిన కృతిశెట్టి ..సర్వ అర్పించేసిందా..?

సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏంటి . ప్రజెంట్ ఇదే బాలకృష్ణ డైలాగ్ ను ట్యాగ్ చేస్తూ కృతిశెట్టిని ట్రోల్ చేస్తున్నారు కుర్రాళ్లు. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతో ఎలాంటి హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ టైం లో కృతి శెట్టి ని ఓ రేంజ్ లో పొగిడేసారు సినీ స్టార్స్.. సినిమా ఇండస్ట్రీలో ఉండే పెద్ద మనుషులు. సినిమా ఇండస్ట్రీకి కృతిశెట్టి లాంటి నటులు కావాలని.. ఇలాంటి యంగ్ హీరోయిన్ ఇండస్ట్రీకి రావడం మంచి విషయం అంటూ స్టేజిపై ఓ రేంజ్ లో పొగిడేశారు.

సీన్ కట్ చేస్తే ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు కూడా కృతి శెట్టి హిట్ కొట్టడంతో సోషల్ మీడియాలో కృతి శెట్టి పేరు ఓ రేంజ్ లో వినిపించింది. ఈ క్రమంలోనే ఓ యంగ్ హీరోని నమ్ముకుని కృతిశెట్టి బిగ్ ప్రాజెక్ట్స్ ని కాదనుకుని మరో యంగ్ హీరో సినిమా చేసింది. అయితే ఎవరు ఊహించని విధంగా ఆ సినిమా కూడా డిజాస్టర్ గా మారింది . అంతేకాదు కృతి శెట్టిని తన సినిమాలో నటించమని చెప్పడానికి పదేపదే ఫోన్ చేసి విసిగించి ఆమెతో సినిమాకి సైన్ చేసిన సదరు స్టార్ హీరో .. సినిమా ఫ్లాప్ అయ్యాక కృతిశెట్టి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడమే కాకుండా ఆమె నంబర్ ను బ్లాక్ చేసినట్లు తెలుస్తుంది .

ఈ క్రమంలోనే కృతిశెట్టి ఆ హీరో పై పెట్టుకున్న ఆశలన్నీ నిరాశగా మిగిలాయి . అంతేకాదు ఈ చెత్త సినిమా కోసం బడా ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకోవడం తో కృతి పొజిషన్ ఇప్పుడు ఎటు కాకుండా మిగిలిపోయింది. ప్రజెంట్ కృతిశెట్టి ఆశలన్నీ నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న కస్టడీ సినిమాపైనే ఉన్నాయి . చూడాలి మరి ఈ సినిమాతో కృతిశెట్టి ఎలాంటి మంచి పేరు తీసుకొస్తుందో..?