జయసుధ పై వచ్చిన పెళ్లి రూమర్ పై క్లారిటీ ఇదే..!!

సీనియర్ హీరోయిన్ నటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈమె ప్రస్తుతం స్టార్ హీరోల కొడుకుల సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె గురించి అప్పుడప్పుడు పలు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. దాదాపుగా ఎన్నో వందల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన జయసుధ హీరోయిన్ గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాని మంచి పేరు సంపాదించిందని చెప్పవచ్చు. ఇప్పటికీ కూడా పలు అవకాశాలు అందుకుంటూనే ఉంటుంది.

Actor-politician Jayasudha critcises Indian government, says 'they don't  appreciate, recognise South cinema' - India Today
గడిచిన కొద్ది రోజుల క్రితం జయసుధ భర్త మరణించారు ఈమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కొడుకుతో కలిసి ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన భర్త చనిపోయిన బాధ నుంచి తీరుకోక ముందే మళ్ళీ సినిమాలలో బిజీగా మారిపోవడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది.ఈ క్రమంలోనే 60 ఏళ్ల వయసులో కూడా ఇమే వివాహం చేసుకోబోతోంది అంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. చాలామంది ఈమెకు వివాహమైపోయింది అనే విధంగా కూడా పోస్ట్లు చేస్తున్నారు. జయసుధ కూడా ఒంటరితనాన్ని భరించలేకపోతోంది అందుకే వివాహం చేసుకోబోతోంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ విషయంపై జయసుధ స్పందిస్తూ తమపైన ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అవుతోంది. సినిమాలలో బిజీ కావడం వల్ల ఒంటరి తరం నుంచి కాస్త బయటపడుతున్నానని ఇలాంటి సమయంలోనే తనపైన ఇలాంటి తప్పుడు వార్తలు ఎందుకు రాస్తున్నారు అర్థం కావలెను తెలియజేసింది. రీసెంట్గా బాలయ్య టాక్ షోలో అన్ స్టాపబుల్ లో పాల్గొనింది. ఎట్టకేలకు తన వివాహం పై వచ్చిన వార్తలను కొట్టిపారేసింది జయసుధ.