రష్మిక పర్సనల్ వీడియోలో విజయ్ వాయిస్.. రిలేషన్‌షిప్ బట్టబయలు అయిందా!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య అఫైర్ ఉందనే వార్తలు గత కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు కారణం వీరిద్దరూ కలిసి వెకేషన్లకి వెళ్లడం, ఇతర సెలబ్రిటీలు వీరి గురించి కొంటె కామెంట్లు చేయడం అని చెప్పొచ్చు. ఈ జంట కొద్ది రోజుల క్రితం మాల్దీవులకు కలిసే వెళ్లారు. వారు కలిసి వెళ్లారని అనడానికి చాలామంది అభిమానులు కొన్ని ప్రూఫ్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. విజయ్ గ్లాసెస్‌ను రష్మిక తొడుక్కుందని, రష్మిక గ్లాసెస్‌ విజయ్ పెట్టుకున్నాడంటూ ఆధారాలు చూపించారు. వీరి మధ్య ఏం లేకపోతే కలిసి వెకేషన్‌కి ఎందుకు వెళ్తారు ఏదో నడుస్తోంది వారి మధ్య అని చాలామంది చర్చలు కూడా జరిపారు.

ఈ నేపథ్యంలోనే రష్మిక, విజయ్ న్యూ ఇయర్ సందర్భంగా కూడా కలిసి ఉన్నారని ఓ వీడియో ద్వారా తెలిసిపోయింది. రష్మిక 2022 డిసెంబర్ 31 నైట్ టైమ్‌లో తన ఇన్‌స్టాలో ఓ లైవ్ వీడియో చాట్ చేసింది. ఈ సమయంలో చాలామంది అభిమానులు ఆమెను ప్రశ్నలు అడిగారు ఒక వ్యక్తి ఏజ్ అడగగా తనకు 26 అని చెప్పింది. అదే సమయంలో ఒక మగ గొంతు వినిపించింది. అది ఎవరిదో కాదు విజయ్ దేవరకొండదేనని రష్మిక ఇన్‌స్టాగ్రామ్ చూసినవారు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. మధ్యలో వినిపించిన వాయిస్‌ను విజయ్ దేవరకొండ వాయిస్‌గా పేర్కొంటూ దానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ కూడా చేశారు. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.

 

అది నిజంగా విజయ్ గొంతు హా లేదా మరెవరో వాయిస్ హా అనేది తెలియదు కానీ వాయిస్ వింటుంటే మాత్రం విజయ్ దే అని అనిపిస్తున్నట్లు కామెంట్ చేస్తున్నారు మరి కొందరు. ఇక ఈ జంట బాలిలో కలిసి విహారయాత్రకు వెళ్లినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే వారి రిలేషన్‌షిప్ గురించి వారు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఫ్యాన్స్ మాత్రం న్యూ ఇయర్‌కి ఈ ప్రేమ పక్షులు కలిసే సమయం గడిపినట్టున్నారు అని కామెంట్లు చేస్తున్నారు. ఇది ఒకటి చాలదా వీరు రొమాంటిక్ రిలేషన్‌షిప్ పెట్టుకున్నారని చెప్పడానికి అని ఇంకొందరు అంటున్నారు.