ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇస్తున్న చిరంజీవి… ఇక సంక్రాంతికి మెగా జాతరే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గత సంవత్సరం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో ముందుగా ఆచార్య సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చి దారుణమైన డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఆ తర్వాత దసరా కానుకగా మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్‌గా తెరకెక్కించే హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు వచ్చే సంక్రాంతికి చిరంజీవి యువ దర్శకుడు బాబీతో వాల్తేరు వీరయ్య సినిమా చేస్తున్నాడు.

Waltair Veerayya: latest poster of Chiru from Waltair Veerayya has been released

ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ ని కూడా కంప్లీట్ చేసుకున్న..ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో పాత చిరంజీవిని మీ ముందుకు తీసుకొస్తున్నాని బాబి ఎన్నో ఎక్స్పెక్టేషన్‌లు క్రియేట్ చేశారు. ఇక ఈ సినిమాలో చిరుతో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ అభిమానుల్లో భారీ హైప్స్ ని క్రియేట్ చేశాయి. ఈ సినిమా మెగాస్టార్‌కు కచ్చితంగా సక్సెస్ ఇస్తుంద‌ని అభిమానులు పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు మెగా అభిమానులకు మరో డబ‌ల్ ట్రీట్ ఇవ్వడానికి మెగాస్టార్ వచ్చేస్తున్నాడు. చిరంజీవి గత చిత్రమైన గాడ్ ఫాదర్ సినిమా సంక్రాంతికి జనవరి 15న జెమినీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది మెగా అభిమానులకు డబుల్ ధమాకానే చెప్పాలి. ఇక దీంతో సంక్రాంతికి మెగా అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.