చిరంజీవికీ తన భార్య అంటే భయమా.. లేక ప్రేమనా..!!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్, ఈవెంట్‌ల‌కు హాజరవుతూ ఈ సినిమాపై మరింత హైప్స్ ను పెంచేస్తున్నాడు… ఇప్పుడు బుల్లితెర కార్యక్రమాల్లో కూడా ఈ సినిమా ప్రమోషన్లు నిర్వహిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే ఈటీవీలో ప్రతి శనివారం ప్రసారం కానున్న సుమ అడ్డా అనే షోలో చిరు సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ ప్రోమోలో చిరంజీవి సుమ తో చేసిన సందడి మాములుగా లేదు. ఈ ప్రోమోలో భాగంగా చిరు పైన కొన్ని డైలాగ్స్ కూడా అందర్నీ ఆకట్టుకున్నాయి. సుమ- చిరంజీవిని ప్రశ్నిస్తూ ఈ రేకలో మీకు ఏ రేక అంటే భయం అని ప్రశ్నించింది.

ఆ ప్రశ్నకు చిరంజీవి సురేఖ అంటూ సమాధానం ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆయన లక్ష్మణ రేఖ అయిన దాటుతాను కానీ సురేఖను మాత్రం దాటను అంటూ చిరు చెప్పుకొచ్చాడు. సుమకు సురేఖగా పేరు మార్చిన చిరంజీవి..చూడాలని ఉంది సినిమాలో ఒక సీన్ ని సుమతో కలిసి రిక్రియేట్ చేశారు.ఇక ఈ ప్రోమోలో భాగంగా డోంట్ స్టాప్ లాఫింగ్… సుమ అడ్డా లోడింగ్ అంటూ చిరు చెప్పిన డైలాగ్ హైలైట్ అయింది.ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు సినిమా డైరెక్టర్ బాబి అలాగే కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.