ఇంట్లో ర‌ష్మిక‌ను ఏమ‌ని పిలుస్తారో తెలుసా..? అస్స‌లు ఊహించ‌లేరు!

నేషనల్ క్రషర్ రష్మిక ఈ ఒక్క నెలలోనే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయింది. ఈమె నుంచి రాబోతున్నారు రెండు చిత్రాల్లో `వారసుడు` ఒకటి. విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అలాగే రష్మిక బాలీవుడ్ లో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో `మిషన్ మజ్ను` అనే మూవీ చేసింది.

స్పై థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం రష్మిక ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతోంది అయితే తాజాగా సోష‌ల్ మీడియా ద్వారా రష్మిక త‌న అభిమానుల‌తో చిట్ చాట్ చేసింది. ఈ సంద‌ర్భంగా ఫ్యాన్స్ అడిగిన అన్ని ప్ర‌శ్న‌కు ఓపిగ్గా స‌మాధానం ఇచ్చింది.

ఈ క్ర‌మంలోనే త‌న నిక్‌ నేమ్ ఏంటి అనేది కూడా బయటపెట్టింది. ఒక అభిమాని మిమ్మ‌ల్ని ఇంట్లో పేరెంట్స్ ఏమని పిలుస్తారు అంటూ ప్రశ్నించగా.. ఎవ‌రూ ఊహించ‌ని సామాధానం ఇచ్చింది. త‌న‌ తల్లిదండ్రులు నన్ను మోని లేదా మోవా అని పిలుస్తారు అంటూ రష్మిక మందన్నా పేర్కొంది. మోని, మోవా అంటే కొడవ భాషలో కూతురు అని అర్థం. అలాగే వార‌సుడు, మిష‌న్ మ‌జ్ను చిత్రాలు మంచి విజ‌యం సాధింస్తాయ‌ని ర‌ష్మిక ధీమా వ్య‌క్తం చేసింది.