అదరగొడుతున్న షారుక్ ఖాన్ పఠాన్ ట్రైలర్..!

బాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్ర పఠాన్. ఈ చిత్రం నుంచి విడుదలైన పలు పోస్టర్స్ సాంగ్స్ చాలా వైరల్ గా మారడమే కాకుండా పలు వివాదాలకు కూడా దారితీసాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో దీపికా వేసుకున్న దుస్తుల పైనా ట్రోల్ చేయడమే కాకుండా పలు వివాదాలకు కూడా దారితీసాయి. ఎంతోమంది ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలని పలు నినాదాలు కూడా చేశారు. కానీ చిత్ర బృందం మాత్రం ఎలాంటి వాటికి భయపడకుండా కేవలం ఈ సినిమా విడుదల చేసే పనిలోనే పూర్తిగా నిమగ్నలయ్యారు.

Deepika Padukone Picture From Pathaan Movie Song Besharam Rang

తాజాగా ఈ రోజున ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఈ ట్రైలర్ విషయానికి.. పఠాన్ చిత్రంలో హీరోగా షారుక్ ఖాన్ నటించిన హీరోయిన్గా దీపికా పదుకొనే నటించింది. ఈ చిత్రాన్ని ఎస్ రాజ్ ఫిలిం పతాకం పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా గత కొద్ది కొద్ది నెలలుగా వాయిదా పడుతూనే వస్తోంది. ఈ ట్రైలర్ ఫుల్ యాక్షన్ సినిమాగా కనిపిస్తోంది.

ఈ చిత్రంలో జాన్ అబ్రహం ఒక పోలీస్ కారు మీద రాకెట్ లాంచ్ బాంబు షూట్ చేయడంతో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఇండియా మీద భారీ ఎత్తున ఒక అటాక్ చేయాలని ప్లాన్ చేస్తున్నటువంటి ఒక ముఠాను ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఎలా వాటిని చేదిస్తారో అనే విషయంపై ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా ఈ ట్రైలర్ చూస్తే మనకి అర్థమవుతోంది. ముఖ్యంగా షారుక్ ఖాన్ చేసిన విజువల్స్, ఫైట్స్ ఈ ట్రైలర్ కు హైలైట్ గా నిలుస్తున్నాయి. అలాగే దీపిక అందం, నటన ఈ ట్రైలర్లో మరింత ఆసక్తినియంగా కనిపిస్తున్నాయి. ట్రైలర్ అద్భుతమైన విజువల్స్ తో ఉండడంతో ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.