ఫుల్ స్వింగ్‌లో బాలయ్య.. NBK 108పై న్యూయ‌ర్ అప్‌డేట్ అదిరిందిగా…!

గాడ్ ఆఫ్ మాసస్ నట‌సింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య‌ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గోపీచంద్ మ‌లినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ కూడా తన తర్వాతి సినిమాను వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి తో చేయబోతున్నాడు.

అయితే ఈ క్రేజీ ప్రాజెక్టుకు NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లు కంప్లిట్ చేసుకుని.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో వేసిన భారీ జైలు సెట్‌లో మాసీవ్ యాక్షన్ సీక్వెన్స్‌తో తాజాగా టీమ్ మొదటి షెడ్యూల్‌ ను పూర్తి చేసుకుంది.

Shine Screens To Produce Nandamuri Balakrishna, Anil Ravipudi's #NBK108, S Thaman On Board To Score Music - Anil Ravipudi, Harish Peddi, Nbk, Sahu Garapati, Shine Screens, Ss Thaman |

ఈ యాక్షన్స్ సన్నివేశాలను వెంకట్ మాస్టర్ ఎంతో స్టైలిష్ గా డిజైన్ చేశారట.. ఈ షెడ్యూల్లో బాలకృష్ణ కూడా పాల్గొన్నారు ఆయనతో పాటు మరికొందరు ఆర్టిస్టులతో కూడా ఈ కీలక సన్నివేశాలను చిత్రీకరించారట. ఇక ఈ క్రమంలోనే ఎన్.బి.కె 108 చిత్ర యూనిట్ మొత్తం నూతన సంవత్సర వేడుకలను ఎంతో గ్రాండ్గాడ్‌గా సెలబ్రేట్ చేశారట. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఎంతో గ్రాండ్ గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

nandamuri balakrishna celebrates new year at nbk 108 sets

ఈ సినిమాలో బాలకృష్ణ తన పాత సినిమాలకు భిన్నంగా ఎంతో కొత్త లుక్ లో కనిపించబోతున్నారట. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా బాలకృష్ణ స్టార్ డమ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ పవర్ ఫుల్ కథను రెడీ చేశారట. యంగ్‌ హీరోయిన్ శ్రీలీల బాల‌య్య కూతురు పాత్ర పోషిస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. NBK 108లో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, తమ్మి రాజు ఎడిటర్ గా, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.