ఓటీటీలో మ‌రో స‌రికొత్త ఇండియ‌న్ రికార్డు క్రియేట్ చేసిన బాల‌య్య‌…!

నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఓటీటీ రంగంలోనే ఎవరు ఊహించని సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. ఇక‌ అన్ స్టాపబుల్ సీజన్ 2 కి స్పెషల్ గెస్ట్ గా వ‌చ్చిన‌. యాక్షన్ స్టార్ గోపీచంద్ తో కలిసి ప్రభాస్ రాగా.. తాజాగా న్యూ ఇయర్ కానుకగా ఈ షో నుంచి బాహుబలి ఎపిసోడ్‌గా వచ్చిన ప్రభాస్ ఎపిసోడ్ డిసెంబర్ 29న రాత్రి 9 గంటలకు అహలో స్ట్రీమింగ్ అయింది.

 Prabhas Unstoppable Episode That Created A Record In Aha Prabhas , Unstoppable E-TeluguStop.com

ఈ ఎపిసోడ్ అనుకున్న ఒక్కరోజు ముందే ఆహలో రావడంతో అభిమానులు కూడా భారీ స్థాయిలో ఈ షోను ఆదరించారు. ఈ ఎపిసోడ్ ముందు నుంచే ప్రోమోస్‌తో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.. బాలయ్య ప్రభాస్ తో ఓ రేంజ్ లో ఆడుకున్నాడు.. ఇక ఈ షోను రెండు భాగాలుగా ప్రకటించిన ఆహా టీం.. తొలిభాగం ఇప్పటికే ఆహాలు భారీ స్థాయిలో దూసుకుపోతుంది.

ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయిన 12 గంటల్లోనే 50 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. ఎవరు ఊహించని సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఈ షో.. 100 మిలియన్ వ్యూస్ నీ అందుకుని రికార్డ్ సృష్టించింది. ఇంత త‌క్కువ టైంలో ఈ రేంజ్‌లో వ్యూస్ రావ‌డం అనేది ఇండియ‌న్ ఓటీటీ చ‌రిత్ర‌లోనే ఓ రికార్డుగా నిలిచిపోయింది. ఆహా కూడా దీనికి సంబంధించిన అధికార ప్రకటనను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు రెండు ఎపిసోడ్ కోసం కూడా బాలయ్య- ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.