తన ఆస్తుల వివరాలను ప్రకటించిన నటి వరలక్ష్మి… ఎందుకో తెలుసా?

రంగురంగుల సినిమా జీవితంలో ఎవరి జీవితం ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఒకానొక దశలో వరుస సినిమాలలో వెలుగొందినవారు, సడెన్ గా అవకాశాలు కోల్పోయి ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక దీపం వున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని అన్న సామెత కొందరికి వర్తిస్తుంది, మరికొందరికి వర్తించదు. అలా ఒకప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉండి, తరువాతి కాలంలో అవకాశాలు లేక ఖాళీగా జీవితాన్ని సాగిస్తున్న నటీమణులలో సీనియర్ నటి బేబీ వరలక్ష్మి కూడా ఒకరు.

1973వ సంవత్సరంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించిన ఈమె ఆ తర్వాత దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల సినిమాలలో నటించింది. ఈ సందర్భంగా బేబీ వరలక్ష్మి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చాలా విషయాలను చెప్పుకొచ్చింది. తెలుగులో చెల్లెలి పాత్రలో నటించి మెప్పించిన ఈ నటి కోలీవుడ్ బాలీవుడ్ సినిమాలలో మాత్రం హీరోయిన్ గా నటించి మెప్పించింది. తన జీవితంలో ఎదురైనా పలు చేదు అనుభవాల గురించి చెబుతూ బాగోద్వేగానికి లోనయ్యింది కూడా. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను కూడా చెప్పుకొచ్చింది.

అప్పట్లో తెలుగులో హీరోయిన్ కి సమానంగా సినిమాలు చేసిన వరలక్ష్మి పారితోషికం విషయంలో కూడా అస్సలు రాజీ పాడేది కాదట. చెన్నైలో తనకు కోట్ల ఆస్తులు ఉన్నాయనే రూమర్లపైన ఆమె స్పందిస్తూ అదంతా నిజం కాదని కొట్టి పారేసింది. అప్పట్లో ఆర్టిస్టులకు చాలా తక్కువగా పారితోషికాలు ఉండేవని తెలిపింది. తన పారితోషికాలు తన స్కూల్ ఫీజులకు కూడా సరిపోయేవి కాదని కూడా ఈ సందర్భంగా తెలిపింది. అయితే ఆ తర్వాత చెల్లెలు పాత్రలు చేయడం మొదలు పెట్టిన తర్వాత బాగా పారితోషికాలు అందుకున్నట్లు నటి వరలక్ష్మి తెలిపింది. కోట్ల ఆస్తులు ఏమీ లేకపోయినా మినిమం ఆస్తులు సంపాదించుకొని ప్రస్తుతం సంతోషంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది.