రాజమౌళికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన జేమ్స్ కేమరూన్..!

బాహుబలి సినిమాలతో మన తెలుగు సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకోవాలన దర్శకధీరుడు రాజమౌళి ఆ తర్వాత తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఇప్పుడు మొత్తం ఇండియన్ సినిమానే ప్రపంచ సినిమాల దృష్టిని ఆకర్షించే విధంగా హాలీవుడ్ లో ఎన్నో అవార్డులు రివార్డులను అందుకుంటూ మరింత ఎత్తుకు వెళుతుంది.

SS Rajamouli's RRR To Get A Sequel? Here's What The Director Has To Say!

తాజాగా హాలీవుడ్‌లో జరిగిన మీట్‌లో ప్రపంచ దిగ్గ‌జ‌ దర్శకుడు జేమ్స్ కేమరూన్ తో దర్శకధీరుడు రాజమౌళి కలిసి మాట్లాడటం అనేది ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించింది. ఇక వీరు కలుసుకున్న వీడియో కూడా ఎంతో వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు దానికి ఫైనల్ వీడియో కట్ అయితే మేకర్స్ విడుదల చేశారు. మరి అందులో కేమరూన్ .. రాజమౌళి మరియు కీరవాణితో త్రిబుల్ ఆర్ సినిమా గురించి చెప్పడంతో వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.

RRR Mania: James Cameron tells SS Rajamouli, 'If you ever want to make a movie over here, let's talk'! | People News | Zee News

అంతేకాకుండా కేమరూన్ భార్య రాజమౌళితో మా వారు ఈ సినిమాని రెండుసార్లు చూశారని చెప్పడంతో వారు మరింత ఎక్సీడ్ కావటం ఈ వీడియోలో చూడవచ్చు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే చివరలో జేమ్స్ కేమరూన్ రాజమౌళితో చెప్పిన మాట సెన్సేషన్ గా మారింది. ‘మీరు ఒకవేళ హాలీవుడ్‌లో సినిమా తీయాలి అనుకుంటే ఒకసారి మనం మాట్లాడుకుందాం’..అని అనడంతో ఈ స్టేట్మెంట్ ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఓ రేంజ్ లో వైరల్ గా మారింది.