నా కవల పిల్లలు గురించి వాళ్లకు ముందే తెలుసు..నయనతార మైండ్ బ్లోయింగ్ కామెంట్స్ వైరల్..!

రీసెంట్‌గా సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార మరియు కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్‌ దంపతులకు సరోగసి విధానం ద్వారా కమల పిల్లలు పుట్టారు. ఈ విషయం కోలీవుడ్‌లో వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్ళికి ముందు వీరిద్దరు కొంతకాలం సహజీవనం చేసి.. అ త‌ర్వాత ఇంటి లోని పెద్ద‌ల‌ను ఒప్పించి త అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.

Nayanthara And Vignesh Shivan Look Adorable In THIS Recent Unseen Picture,  They Pose Hand-In-Hand

విచిత్రంగా వీరికి పెళ్లయిన నాలుగు నెలలకే వీరిద్దరూ తల్లిదండ్రులు కావడం, అది కూడా సరోగసి విధానాన్ని ఎంచుకోవడంతో హాట్ టాపిక్ గా మారింది. ఏదో విధంగా ఈ వివాదాన్ని ఈ దంపతులు అధిగమించగలిగారు. నయనతారకు కవల పిల్లలు పుట్టిన సమయంలో తెలుగులో ఎన్టీఆర్ కు జంటగా నటించిన అదుర్స్ సినిమాలోని సన్నివేశాలతో ఎన్నో మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు నయనతార తాజగా తాను నటిచిన కనెక్ట్ సినిమా ఈనెల 22న ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. అయితే ఇప్పుడు నయనతార తన పాత సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొంటుంది. ఈ సినిమా కోసం నయనతార తాను పెట్టుకున్న రూల్స్ ని బ్రేక్ చేసింది.
ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తెలుగులో నయనతార యాంకర్ సుమతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో నయనతార కనెక్ట్ సినిమాతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా ఆమెతో పంచుకుంది.

ఆ సమయంలో నయనతారకు కవల పిల్లలు జన్మించిన సమయంలో అదుర్స్ సినిమాలోని సన్నివేశాలను మీమ్స్ రూపంలో తెగ వైరల్ అయ్యాయి.. ఆ సినిమాలోని బ్రహ్మానందం- నయనతారకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఎంతో ఫన్నీగా ఉంటాయి. బ్రహ్మానందం ఆ సినిమాలో బట్టా చారి పాత్రలో నటించారు. నయన్- విగ్నేష్ శివన్‌ వివాహం జరిగినప్పుడు కూడా ..బట్టు బాధపడడం.. పిల్లలు పుట్టినప్పుడు వారిని ఆడించడం లాంటి అంశాలని అదుర్స్ చిత్రంలో లింక్ చేస్తూ నెటిజన్లు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేశారు.

Nayanthara and Vignesh Shivan receive clean chit in surrogacy row; Tamil  Nadu govt panel states couple adhered to rules | Hindi Movie News -  Bollywood - Times of India

ఆ మీమ్స్ ని సుమ నయనతార కు చూపించడంతో ఆమె ఎంతో సరదాగా ఫీల్ అయింది. ఆ మీమ్స్ ని చూసి ఆమె ఎంతో సంతోషించింది. అదుర్స్ సినిమాలో కూడా నయనతార కి చివరలో కవల పిల్లలు పుడతారు. ఆ పిల్లలని బ్రహ్మానందం ఎత్తుకొని ఆడిస్తాడు. అప్పుడు అదుర్స్ సినిమాలో జరిగిందే నయనతార రియల్ లైఫ్ లో కూడా ఇద్దరు కవల పిల్లలు జన్మించడం యాదృచ్ఛికంగా జరిగింది. ఇప్పుడు నయనతార ఈ విషయంపై స్పందిస్తూ.. బహుశా నాకు కమల పిల్లలు పుడతారనే విషయం వి వి వినాయక సార్ కి ముందే తెలుసేమో అని ఆమె సరదాగా అంది. ప్రస్తుతం నయనతార చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.