టాలీవుడ్ స్క్రీన్‌కు ఏటా ఎందరో హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. సోనాలి బింద్రే, శిల్పా శెట్టి, ప్రీతి జింటా, కత్రినా కైఫ్, బిపాసా బస్సు ఇలా ఎందరో మన టాలీవుడ్‌లో నటించిన తరువాతే గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సిల్వర్ స్క్రీన్ చాలామంది ఇతర హీరోయిన్లకు కూడా మంచి బ్రేక్ ఇచ్చింది. అయితే ఈ ఏడాది ముగియనున్న సందర్భంలో 2022లో తెలుగు తెరకు పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.
• షిర్లే సేథియా
క్యూట్ యాక్ట్రెస్ షిర్లే సేథియా నాగశౌర్య మూవీ ‘కృష్ణ వ్రింద విహారి’తో తెలుగు సిల్వర్‌స్క్రీన్ హీరోయిన్‌గా పరిచయమయ్యింది. ఈ ముద్దుగుమ్మ ఈ మూవీలో డామినేటింగ్ రోల్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటన పరంగానే కాకుండా తన అందాలతో చాలామంది మనుషులను దోచేసింది. ఈ సినిమాకి తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని తన ముద్దు ముద్దు మాటలతో బాగా ఆకట్టుకుంది.
• సంయుక్త మీనన్
పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ ద్వారా మలయాళ నటి సంయుక్త మీనన్ టాలీవుడ్ డెబ్యూ ఇచ్చింది. భీమ్లా నాయక్ తర్వాత ఆమె బింబిసారలో లీడ్‌రోల్ చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.
• అలియా భట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఆర్‌ఆర్ఆర్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. తర్వాత ఎన్టీఆర్ – కొరటాల శివ మూవీలో యాక్ట్ చేసేందుకు సైన్ చేసింది. కానీ తర్వాత ఆ మూవీ నుంచి తప్పుకుంది.
• ఒలీవియా మోరిస్
బ్రిటన్ యాక్ట్రెస్ ఒలీవియా మోరిస్ ఆర్‌ఆర్ఆర్ మూవీతో తెలుగు చలనచిత్ర సీమలో అడుగు పెట్టింది.
• అనన్య పాండే
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాలో నటించే తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ ఫ్లాప్ కావడంతో ఆ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు రాలేదు.