2022 లో అమ్మగా ప్రమోషన్ పొందిన స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!

ఎలాంటి వారి జీవితంలోనైనా సరే అమ్మగా ప్రమోషన్ పొందడం అంటే అదొక అద్భుతమైన విషయమని చెప్పవచ్చు. ఇక సినీ సెలబ్రిటీల విషయానికి వస్తే వీరు ఎంతో మంది అమ్మదనాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. అలాంటివారు ఇప్పటివరకు చాలామందె ఉన్నారు. అయితే ఈ ఏడాది ఎంతమంది అమ్మగా ప్రమోషన్ పొందారో ఒకసారి తెలుసుకుందాం.

1). కాజల్ అగర్వాల్:
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న ఈ ముద్దుగుమ్మ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ను వివాహం చేసుకొని ఈ ఏడాది ఏప్రిల్ 19న మగ బిడ్డకు జన్మనిచ్చింది.

2). చిన్మయి:
డబ్బింగ్ ఆర్టిస్టుగా సింగర్ గా ఎంతో పేరు సంపాదించింది చిన్మయి నటుడు రాహుల్ రవీంద్రన్ ను వివాహం చేసుకొని కవల పిల్లలకు జన్మనిచ్చింది.

3). సౌందర్య:
సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజనీకాంత్ ,విశాగన్ దంపతులకు సెప్టెంబర్ 11న మగ బిడ్డకు జన్మనిచ్చారు. సౌందర్య కు మొదట బిజినెస్ మ్యాన్ అశ్విన్ కుమార్ తో వివాహం జరిగింది. ఆ తర్వాత వారిద్దరికీ ఒక కుమారుడు కూడా జన్మించారు. అశ్విన్ కు విడాకులు ఇచ్చి 2019లో వ్యాపారవేత్త విషాగన్ ను వివాహం చేసుకొని ఇప్పుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

4). ప్రణీత:
అతి తెలుగు అమ్మాయిల పేరు పొందిన ప్రణీత ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజున వివాహం చేసుకొని ఈ ఏడాది జూన్లో ఒక పాపకు జన్మనిచ్చింది.

5). నయనతార:
కోలీవుడ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న నయనతార ఈ ఏడాది అక్టోబర్లో సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చింది. కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది.