అటు తిరిగి ఇటు తిరిగి..మళ్లీ అదే బ్యూటీ దగ్గరకు వచ్చిన కొరటాల..!?

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు అంటారు . బహుశా ఈ వార్త విన్నాక అది నిజమే అనిపిస్తుంది. స్టార్ డైరెక్టర్ గా ఉన్న కొరటాల శివ.. హీరోయిన్స్ ఎంపిక విషయంలో ఎక్కువ టైం తీసుకుంటారు అన్న రూమర్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. కాగా ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలలో హీరోలను చూస్ చేసుకున్నంత త్వరగా హీరోయిన్ ను చూస్ చేసుకోలేడు. రీజన్ ఏంటో తెలియదు కానీ కొరటాల హీరోయిన్ విషయంలో అంత త్వరగా సాటిస్ఫైడ్ అవ్వడు అన్న టాక్ ఎక్కువగా వినిపిస్తుంది .

ఇదే క్రమంలో ఆయన నెక్స్ట్ తీయబోయే సినిమా ఎన్టీఆర్ 30 లో కూడా హీరోయిన్స్ విషయంలో ఎక్కువ టైం తీసుకుంటున్నాడు . కాగా ఈ సినిమాలో ఫస్ట్ అలియా భట్ ని హీరోయిన్గా అనుకున్నారు . అయితే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ తరువాత ఆమె ప్లేస్ లోకి దీపికా పదుకునే.. రష్మిక మందన్నా..కృతి శెట్టి ..సోనాక్షి సిన్హా ..మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్.. శ్రీ లీల ఇలా వరుసగా పలువురు హీరోయిన్స్ ని ట్రై చేశాడు.

అయితే ఇప్పటివరకు ఏ హీరోయిన్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. కాగా రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం అటు తిరిగి ఇటు తిరిగి కొరటాల మళ్ళీ ఆలియా భట్ నే ఫిక్స్ అయినట్లు న్యూస్ వైరల్ అవుతుంది. సినిమా కథను రాసుకున్నప్పుడే అలియా భట్ ఈ పాత్రకు బావుంటుందని ఊహించుకున్నాడట కొరటాల. కాగా ఆమె పెళ్లయి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయి బిడ్డ కూడా జన్మనివ్వడంతో ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ను ట్రై చేయడానికి సిద్ధంగా ఉందట. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించడానికి అలియా భట్ ఓకే చెప్పినట్లు ఒక క్రేజీ రూమర్ వైరల్ గా మారింది. చూడాలి మరి అలియా భట్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటుందో..?