“ధమాకా” కోసం మొదట అనుకున్న హీరోయిన్ ఎవరో తెలిస్తే..షాక్ అయిపోతారు..!!

మాస్ మహారాజా రవితేజ హీరోగా అందాల ముద్దుగుమ్మ శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం “ధమాకా”. త్రినాధ రావు నక్కిన డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 23న గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే సినిమాకి సంబంధించిన సాంగ్స్, ఫస్ట్ లుక్, టీజర్ , ట్రైలర్ అన్ని అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి . ఈ క్రమంలోనే సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మాస్ మహారాజ హీరో ఫ్యాన్స్ .

కాగా రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ చూస్తేనే అర్థమయిపోతుంది సినిమా కోసం మాస్ మహారాజు రవితేజ ఎంతలా కష్టపడ్డాడో.. ఈ మధ్యకాలంలో వరుసగా డిజాస్టర్లు అందుకుంటున్న రవితేజ ..ఈ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమా కథను అనుకున్నప్పుడు హీరోయిన్ గా మొదటగా అనుకున్నింది శ్రీలీల ను కాదట . మాస్ మహారాజా తో క్రేజీ కాంబో గా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ హన్సిక ను అనుకున్నారట .

ఇదే విషయాన్ని ఆమెకు అప్రోచ్ అయ్యి వివరించగా.. స్టోరీ స్టోరీ వినకుండానే హన్సిక ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట. దానికి కారణం ఆమె పెళ్లి డేట్ అప్పటికే ఫిక్స్ అయిపోయి ఉండడం. రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న హన్సిక .. గత కొంతకాలంగా ఆయనతో ప్రేమను నడుపుతున్న సంగతి తెలిసిందే . ఆమె పెళ్లి చేసుకునే రెండు మూడు నెలల ముందు నుండే మ్యాటర్ మనకి సోషల్ మీడియాలో లీక్ అయింది .

కానీ వాళ్ళు రెండేళ్ల ముందే వాళ్ల పెళ్లి డేట్ ను ఫిక్స్ అయిపోయి ఉన్నారట . ఈ క్రమంలోనే హన్సిక అసలు నిజం చెప్పకుండా సినిమా స్టోరీ వినకుండా రిజెక్ట్ చేసింది అని తెలిసి రవితేజ చాలా హర్ట్ అయ్యారట. ఎందుకు ఆమె రిజెక్ట్ చేసిందా అంటూ బాధపడ్డారట. ఆ తర్వాత మ్యాటర్ తెలుసుకొని కూల్ అయ్యారట . ఏది ఏమైనా సరే రవితేజ పక్కన హన్సిక కన్నా శ్రీలీలనే బాగుంది అంటున్నారు ఫ్యాన్స్. మరి చూడాలి ఈ యంగ్ బ్యూటీ ఏ రేంజ్ లో కుర్రాళ్లను ఆకట్టుకుంటుందో..?