నందమూరి కుటుంబంలో ఎంతోమంది నటులుగా ఇండస్ట్రీలోకి పరిచయమయ్యారు. అందులో మాత్రం కొంతమంది సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో నందమూరి తారకరత్న కూడా ఒకరు. బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ హడావిడి బాగానే కొనసాగిస్తున్నారు. అయితే తారకరత్న ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న సరైన సక్సెస్ రాలేదని చెప్పవచ్చు. ఒకానొక సమయంలో ఒకే ఏడాది ఏడు సినిమాలను తన చేతిలో పెట్టుకున్న ఘనత తారకరత్నకే దక్కింది.
కానీ జనాలు మాత్రం తారకరత్నని హీరోగా సక్సెస్ చేయలేకపోయారు. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో ఎప్పటికప్పుడు కాస్తా హడ విడిగానే కనిపిస్తూ ఉంటారు తారకరత్న. అయితే నటనపై కూడా అతని ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. హీరోగా సక్సెస్ కాకపోవడంతో పలు చిత్రాలలో విలన్ గా కూడా నటించారు. నటుడుగా తనకి ఎంతటి గుర్తింపు దక్కిందో అంతే తొందరగా ఆ గుర్తింపు పోయిందని చెప్పవచ్చు. దీంతో నటుడుగా గుర్తింపు తెచ్చుకోలేకపోవడంతో తారకరత్న బిజినెస్ లో బాగానే నిలదొక్కుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రధాన క్రియాశీలకంగా ఉన్న రాజకీయ పార్టీలలో బిజీ కావాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.
అందుకు సంబంధించి తారకరత్న లుక్ లో మారినట్లుగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. పాలపర్రులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు తారకరత్న.అయితే తాను అక్కడే పొలిటికల్‌గా ఎంట్రీ పై కూడా క్లారిటీ ఇచ్చే విధంగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రాజకీయ నాయకుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుని విధంగా తారకరత్న ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. తారకరత్న న్యూ లుక్ చూస్తే చాలా పవర్ ఫుల్ గా ఉందని చెప్పవచ్చు. మరి అసలు విషయం పై క్లారిటీ ఇస్తారమే చూడాలి మరి.