Big boss -6 టైటిల్ని గెలుచుకున్న రేవంత్..!!

బిగ్ బాస్ 6 ఇటీవలే కొన్ని గంటల క్రితం ముగిసింది. ఇక సింగర్ ఎల్ వి రేవంత్ బిగ్ బాస్ తెలుగు-6 విన్నర్ అయ్యారు 95% ఓటింగ్ తో విన్నర్ అవుతారనే ముందే ఫిక్సయినట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ నిర్వహకులు కూడా అలానే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొదటినుంచి కసితో రేవంత్ తన ఆటను కొనసాగించారని..అయితే కొన్నిసార్లు తప్పు ఒప్పులను కూడా వదిలేశారని తెలుస్తోంది. ఎలాగైనా సరే విన్నర్ గా మాత్రం అవ్వాలనుకున్నారు అందుచేతనే టాస్క్ ఇస్తే అవతల ఉన్నది ఎవరైనా సరే ఆటని నెక్స్ట్ లెవెల్ వరకు తీసుకువెళ్లారని చెప్పవచ్చు.

Bigg Boss 6 : Bigg Boss Season 6 Winner 'Revanth'.. Announced on Official  Site..

ముఖ్యంగా రేవంత్ భార్య సీమంతం ,బిడ్డ పుట్టడం ఇవన్నీ రేవంత్ కి బాగా కలిసి వచ్చాయి.అతనికి అక్కడ ఎమోషనల్ బాగా పండించడంతో ఇది కూడా కొంత పాజిటివ్ పెరిగిపోయింది. బిగ్ బాస్ లో ఎక్కువగా నామినేట్ అయిన కంటెస్టెంట్లే విన్నర్ అవుతారనే సాంప్రదాయం చాలా రోజుల నుంచి ఉన్నది అలా.. కౌశల్, రాహుల్ సన్నీ అభిజిత్లు కూడా ఎక్కువసార్లు నామినేట్ అవ్వడం జరిగింది. ఇందులో చాలామంది విజేతలుగా కూడా నిలిచారు. రేవంత్ విషయంలో కూడా ప్రస్తుతం అదే సంప్రదాయం కొనసాగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

సెప్టెంబర్ 4వ తేదీన మొదలైన ఈ సీజన్ మొత్తం 21 మంది సభ్యులు పోటీ పడగా.. రేవంత్ ,ఆదిరెడ్డి, శ్రీహన్ కీర్తిభట్ ఫైనలిస్టులో మిగిలారు. మొదట రోహిత్ ఆ తర్వాత ఆదిరెడ్డి ,కీర్తి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికి వచ్చారు. టాప్ – లో శ్రీహాన్, రేవంత మాత్రమే మిగిలారు. ప్రైజ్ మనీ లో సగం అమౌంట్ ని రేవంత్ , శ్రీహాన్ ఎవరో ఒకరిని తీసుకొని వెళ్లచ్చని నాగార్జున సూచించారు. ఇద్దరు కూడా నో చెప్పారు ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ.30 లక్షలకు పెంచారు అప్పుడు కూడా సైలెంట్ గా ఉండడంతో ఈ మొత్తాన్ని రూ.40 లక్షలకు పెంచారు. దీంతో శ్రీహాన్ హౌస్ మేట్స్ మెజార్టీ మెంబర్స్ తో పాటు పేరెంట్స్ కూడా డబ్బులు తీసుకోమని చెప్పడంతో ఆటోమేటిక్గా శ్రీహాన్ తీసుకోక రేవంత్ విన్నర్ అయ్యారు.