పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ సినిమాలు ప్రస్తుతం తెరకెక్కుతూ ఉన్నాయి. ఇక ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు మాత్రం ఇప్పుడు తాజాగా ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. ఎప్పుడెప్పుడు ప్రభాస్ ను రాముడిలా సిల్వర్ స్క్రీన్ పై చూడాలనుకుంటున్నా అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ తగులుతోంది. ఆదిపురుష్ సినిమా విడుదల వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా టీజర్ విడుదల నుంచి నెట్టింట విపరీతంగా బజ్ ఏర్పడింది. దీంతో కొంతమంది ఈ సినిమా టీజర్ పైన ట్రోల్ చేయడం జరిగింది.
దీంతోపాటు ఈ సినిమా పైన బజ్ కూడా త్రూ అవుట్ ఇండియా రేంజ్ లో బాగా ఫామ్ అవుతోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే జూన్ 12వ తేదీన ఆది పురుష్ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఉన్నట్టుండి వాయిదా వేయడంతో అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించగా.. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుని పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ రెండు పాత్రలు రీ షూట్ జరుగుతోందని టాక్ బాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. దీంతో ఈ సినిమా జూన్ 12 కు మరొకసారి వాయిదా వేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ ప్రభాస్ నటించిన మరొక చిత్రం సలార్ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఈ సినిమా కూడా షూటింగ్ చాలా వేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా కూడా వీలైనంత త్వరగా విడుదల చేయడానికి పలు సన్నహాలు చేస్తున్నారు చిత్ర బృందం. దీంతో ఆది పురుష్ కంటే ముందే సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ఆదిపురుష్ సినిమా అనుకున్న తేదీకి రాదని వార్తలుగా మారుతున్నాయి. ఈ విషయం పైన చిత్ర బృందం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.