మ‌హేష్ బాబు అలాంటి వాడే ..సంచ‌ల‌న విష‌య‌ల‌ను బ‌య‌ట పెట్టిన న‌మ్ర‌త‌..!

సినిమా పరిశ్రమలో ఎందరో సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ జంటలు విడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా ఆ సెలబ్రిటీలు విడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే టాలీవుడ్ లోనే స్టార్ కపుల్స్ గా వెలుగుతున్న మహేష్- నమ్రత మధ్య కూడా గొడవలు జరిగినట్టు ఏమీ వార్తలు బయటకు రాలేదు. వారి పెళ్లి జరిగి 17 సంవత్సరాలు అవుతున్న ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.

ఈ జంట తమ గురించి బయట వారు విమర్శలు చేసే అవకాశం కూడా ఎప్పుడు ఇవ్వటం లేదు. ఈ క్రమంలోనే నమ్రత తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భార్యాభర్తల అన్నాక ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే మాత్రమే పెళ్లి చేసుకుంటే ఆ బంధం ఎంతో అన్యోన్యంగా ఉంటుందని ఆమె అన్నారు. మహేష్ తో నాకు పెళ్లి జరిగి 17 సంవత్సరాలు అయిందని. అయితే పెళ్లికి ముందు మేము మంచి స్నేహితులుగా ఉన్నాం.

Namrata Shirodkar Birthday: Mahesh Babu revealed his crush for former Miss  India pictures latest celeb news | Celebrities News – India TV

అది పెళ్లి తర్వాత కూడా మా ఇద్దరి మధ్య వచ్చే అన్ని విషయాలను ఒకరికి ఒకరు పంచుకునే వాళ్ళమని నమ్రత ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ అనుమానాలకు, రహస్యాలకు, అపార్థాలకు చోటు లేదని.. మా ఇద్దరి మధ్య ఎప్పుడు ప్రేమకే చోటు ఉంటుందని.. మహేష్ బయటకు వెళ్తే పదిసార్లు ఫోన్ చేసి విసగించనని ఆయన మీద నాకు ఎప్పుడూ నమ్మకం ఉంటుందని నమ్రత చెప్పుకొచ్చింది. మహేష్ కూడా నా విషయంలో అదే విధంగా వ్యవహరిస్తాడని.. ఇక మాకు గౌతమ్- సితార పుట్టిన తర్వాత కూడా మా ఫ్యామిలీ లైఫ్ ఎంతగానో మారిపోయిందని ఆ ఇంటర్వ్యూలో కామెంట్లు చేసింది.

Mahesh Babu and Namrata Shirodkar's adorable birthday wishes for Sitara |  Telugu Movie News - Times of India

గౌతమ్ పుట్టిన సమయంలో హార్ట్ బీట్ సరిగ్గా లేదని వైద్యులు చెప్పడంతో నేను చాలా టెన్షన్ పడ్డాను అని గౌత‌మ్‌ పుట్టిన సమయంలో బరువు కేజిన్నర మాత్రమే ఉన్నాడని.. ఇక ప్రతిరోజు గౌతమ్ 10 గ్రాముల బరువు పెరగాలని వైద్యులు సూచించారని ఆమె ఆ ఇంటర్వ్యూలు చెప్పుకొచ్చింది. గౌతమ్ ప్రతిరోజు బరువు పెరగాలని దేవుని కోరుకునే వాళ్ళమని నమ్రత వెల్లడించారు. ప్రస్తుతం మహేష్ భార్య అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.