దుమ్ములేపుతోన్న ర‌వితేజ ‘ధ‌మాకా’ ప్రి రిలీజ్ బిజినెస్‌… వామ్మో ఏంటి మ‌నోడి అరాచ‌కం..!

మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథ‌ రావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న సినిమా ధమాకా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ రూపొందుతుంది. ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు 25 కోట్ల రూపాయలుగా అయ్యిందంటూ సమాచారం. రవితేజ క్రాక్ సినిమా తర్వాత మళ్లీ హిట్ అందుకోలేదు. వరుసగా రెండు డిజాస్టర్ లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయినా కూడా ఇప్పుడు వస్తున్న ధమాకా సినిమాకు పాతిక కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం అనేది ఎంతో రిస్క్ అయినా ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో నిర్మాతలు అంత ఖర్చు చేశారంటూ సమాచారం అందుతుంది.

Dhamaka - Teaser | Ravi Teja | Sreeleela | Bheems Ceciroleo | Thrinadha Rao  Nakkina - YouTube

లేటెస్ట్‌ సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఏకంగా 20 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. 15 కోట్ల వరకు నాన్‌ థియేట్రికల్‌ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా విడుదల అవకముందే నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా విడుదలయ్యాక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా 30 కోట్ల నుండి 40 కోట్ల వరకు కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉంది.

Ravi Teja's Dhamaka Release Date Locked | Ravi Teja News

ఈ సినిమాతో రవితేజ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ సినిమాను దర్శకుడు మాస్‌ అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా నచ్చే విధంగా తెర‌కెక్కించినట్టు తెలుస్తుంది. రవితేజ కూడా తన పాత సినిమాలకు భిన్నంగా ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోషన్ చూస్తున్నాడు. గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించలేదు.

Dhamaka romantic glimpse: Ravi Teja expressions first class

ఇప్పుడు మాత్రం తన పాత శైలికి భిన్నంగా ఈ సినిమా ప్రమోషన్ లో ఈవెంట్స్ లో మరియు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు రవితేజ.. దీంతో ధమాకా సినిమాకు విడుదల అవకుండానే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రవితేజ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ అందుకుంటారని రవితేజ అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.