ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా అవుతారు 2.. ఈ వారంలోప్రేక్షకు ముందుకు రాబోతున్నన ఈ సినిమా కోసంఅందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2009లో వచ్చిన అవతార్ పార్ట్ 1కి ఇప్పుడు సీక్వెల్ గా అవతార్ దీ వే ఆఫ్ వాటర్ రాబోతుంది. ఈ సినిమాను చూసే ప్రేక్షకులు కూడా పండారా గ్రహానికి తీసుకువెళ్లేందుకు హాలీవుడ్ దర్శకధీరుడు జేమ్స్ కామెరాన్ సినిమాను ఎంతో అద్భుతమైన విజువల్ వండర్ గా తెరకెక్కించాడు.
ఈ సినిమా అందుకే ప్రపంచవ్యాప్తంగా వేలకోట్ల రూపాయలు కలెక్షన్ రాబట్టడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సినీ అభిమానులు ఎక్కడ ఉన్నా అవతార్ 2 సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటున్నారు. భారత్‌లో కూడా ఈ సినిమాను దాదాపు 500 కోట్ల నుంచి 600 కోట్ల వరకు కలెక్షన్లో రాబోతుందని ఎంతో నమ్మకంగా ఉన్నారు.
అందులో మరి తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా ఏకంగా రు. 100 కోట్లను మించి కలెక్షన్లను వసూల్ చేస్తుందంటూ ఇండియన్ డిస్నీ వర్గాలు వారు మాట్లాడుకోవడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. భారత్‌లో అవతార్ 2 సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ విషయంలోను అరుదైన రికార్డును సృష్టించారు ఇండియన్ సినీ అభిమానులు. అయితే ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లతో పోలిస్తే ఇండియన్ కలెక్షన్స్ చాలా తక్కువే.
అయినా కూడా భారతీయ సినిమాలు అందుకున్న రికార్డులతో పోలిస్తే అవతార్ 2 అంతకుమించి రికార్డులు సృష్టిస్తుందంటూ బాక్సాఫీస్ నిపుణులు అంటున్నారు. రీసెంట్ గా ఇండియాలో ప్రీమియర్ షోగా అవతార్2 ప్రదర్శించగా దానికి పాజిటివ్ టాక్ రావడంతో అయితే సినిమా విడుదలయ్యాక ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా కలెక్షన్స్ ఉండబోతున్నాయని సిని వర్గాల వారు అంటున్నారు.