మెగా కుటుంబం గత పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వేళ రానే వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారని రీసెంట్గా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ విషయం బయటకు రావడంతో మెగా అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే మెగా వారుసుడుకు పేర్లు కూడా పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన ప్రెగ్నెన్సీ పై మరో వివాదస్పదమైన వార్త బయటకు వస్తుంది.
రామ్ చరణ్- ఉపాసన సరోగసి ద్వారా పిల్లలు కంటున్నారని గత రెండు రోజులకు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి వచ్చే వార్తలపై వింత వాదన కూడా జరుగుతుంది. ఇందులో కొందరు ఇలా ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి ఫేక్ న్యూస్ రాయడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు మెగాఫ్యాన్స్. వారు ఏమైనా సినిమా హీరోయిన్లు కాదు. రామ్ చరణ్ సరోగసి ద్వారా పిల్లలు కావాలనుకుంటే ఉపాసన ఎప్పుడో జన్మనిచ్చి ఉండేది.
సోషల్ మీడియాలో రాసే రాతల్లో నిజమేదో తెలియకుండా ఎవరికి ఏది అనిపిస్తే అది రాసేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలకు ఉపాసన ఎందుకు ? పిల్లలు కనలేదు అని అడగరు. ఇప్పుడు ఆ శుభవార్త చెబితే ఆమె ఎలా కనబోతుంది అంటూ ఫేక్ వార్తలను సృష్టిస్తున్నారు. ఉపాసన హీరోయిన్ల లాగా మరీ అంత బుర్ర లేకుండా ఉంటుందని అనుకోవటం పొరపాటు. ఆమె రెండు ఉన్నత కుటుంబాలకి చెందిన వారసురాలు. ఏం నిర్ణయం తీసుకున్నా ఒకటికి పదిసార్లు కచ్చితంగా ఆలోచించి తీసుకుంటుంది.
అంతేగాని ఎవరు ఏది చెప్పకపోయినా ఏదో ఒకటి ఫేక్ న్యూస్ రాసి డబ్బులు వెనకేసుకోవడానికి, పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి వార్తలు రాయటం సోషల్ మీడియా వారికి సరికాదు. అయితే గతంలో కూడా నయనతార సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినప్పుడు కూడా కోర్ట్ వారి సరోగసి గురించి తీర్పు ఇవ్వకుండానే సోషల్ మీడియాలో కొందరు అత్యుత్సాహంతో వారికి శిక్షలు కూడా వేసేశారు. తర్వాత నిజం తెలిసేసరికి నాలుక కరుచుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియా ఫేక్ న్యూస్ వాళ్ళు ఉపాసన ప్రెగ్నెన్సీ పై పడ్డారు. ఈ విషయం ఎంతవరకు ? వెళ్తుందో చూడాలి.