2022 సాంగ్స్: ఈ ఏడాది అదరగొట్టిన టాలీవుడ్ సాంగ్స్ ఇవే.. 

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏటా ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలోని కొన్ని సినిమాల్లోని పాటలు సూపర్ హిట్ కావడం కామన్. ఈ ఏడాది కూడా కొన్ని పాటలు సూపర్ హిట్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అవేవో ఇప్పుడు తెలుసుకుందాం.

బంగార్రాజు: ఈ సినిమాలోని కళ్ళకు కాటుక ఎట్టుకుని.. కాళ్లకు పట్టీలు కట్టుకొని… అనే పాట ప్రేక్షకులను బాగా అలరించింది.

రౌడీ బాయ్స్: ఈ సినిమా నుండి బృందావనం నుండి కృష్ణుడు వచ్చాడే…. అనే పాట బాగా ఫేమస్ అయింది.

గుడ్ లక్ సఖి: ఈ సినిమాలోని రావే రావే సఖి…. మురిసే ముచ్చట్లకి అనే పాట ప్రేక్షకులను అల్లరించింది.

ఖిలాడి : ఈ సినిమా లొని నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్… అనే పాట సూపర్ హిట్ అయింది.

సెహరి: ఈ సినిమాలోని ఓ కలలా…ఇన్నాళ్లే నిన్ను దాచి లోకమే అనే పాట ప్రేక్షకులను ఎంతగానో అల్లరించింది.

డీజే టిల్లు : ఈ సినిమాలోని లాలాగూడ అంబర్ పేట.. మల్లేపల్లి మలక్పేట.. పాటసూ పిల్లా….అనే పాటలు సూపర్ గ నిలిచాయి.

భీమ్లా నాయక్ : ఈ సినిమాలోని భీమ్లా నాయక్…. ఇరగదీసే ఈడీ ఫైర్ సల్లగుండా…. అనే పాట సూపర్ హిట్ అయింది.

ఆడవాళ్లు మీకు జోహారు: ఈ సినిమా నుండి ఆడాళ్లు మీకు జోహార్లు అనే పాట ప్రేక్షకులను ఎంతగానో అల్లరించింది.

రాధే శ్యామ్: ఈ సినిమాలోని నగుమోము తారలే.. తెగిరాలే నెలకి…. అనే పాట హిట్ అయింది.

ఆర్ఆర్ఆర్ :- పొలం గట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు, కొమరం భీముడో కొమరం భీముడో పాటలు హిట్స్ అయ్యాయి.

ఆచార్య : ఈ సినిమా లోని సీమలు దూరని సిట్టాడవికి సిరునవ్వొచ్చింది, లాహే లాహే లాహే లాహే లాహిలాహేలాహేలాహే పాటలు హిట్ అయ్యాయి.

సర్కారు వారి పాట: ఈ సినిమాలోని వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదకి…. మ మ మహేషా……అనే పాటలు హిట్ అయింది.

ఎఫ్ 3: ఈ సినిమాలోని అధ్యక్ష లైఫ్ అంటే మినిమం ఎట్టా ఉండాలా….అనే పాట ప్రేక్షకులను అల్లరించింది.

ది వారియర్: ఈ సినిమా లొని నా పక్కకు నువ్వే వస్తే హార్టబిటే స్పీడవుతుందే….. అనే పాట ప్రేక్షకులను అలరించింది.

బింబిసార: ఈ సినిమాలోని గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం అనే పాట హిట్ అయింది.

సీతారామం : ఈ సినిమాలోని ఇంతందం దారి మళ్లిందా భూమి పైకి చేరుకున్నదా….. ఓ సీతా వదలనిక తొడవుతా.. అనే పాటలు హిట్ అయ్యాయి.

మాచర్ల నియోజకవర్గం: ఈ సినిమాలోని మాచర్ల సెంటర్ లో మాపటేల నేనొస్తా…. అనే పాట హిట్ అయింది

గాడ్ ఫాదర్: ఈ సినిమాలోని తార్ మార్ తక్కర్ మార్ అనే పాట ప్రేక్షకులను ఎంతగానో అల్లరించింది.

జిన్నా : ఈ సినిమాలోని జారు మిఠాయీ నా జారు మిఠాయీ అనే పాట హిట్ అయింది.