ఈ యంగ్ హీరోలకు ఏమైంది.. వచ్చే ఏడాది నుంచి భారీగా పారితోషికం తగ్గింపు!

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు నటించిన సినిమా హిట్ అవుతే వెంటనే వారి నెక్స్ట్ సినిమా కి రెమ్యూనరేషన్ పెంచుతూ ఉంటారు. అయితే మరికొంత మంది హీరోలు మాత్రం రెమ్యూనరేషన్ కంటే ముందు సినిమా హిట్ అయితే చాలు అని అనుకుంటారు. ఈ ఏడాది ప్లాప్ అయిన సినిమా లతో బాధ పడకుండా వచ్చే ఏడాది అయిన విజయం కోసం కష్టపడాలి అని అనుకుంటున్నారట కొంతమంది హీరోలు. వారిలో రాజ్ తరుణ్ కూడా ఒకరు. ఈ మధ్య రాజ్ తరుణ్ నటించిన సినిమాలు కొన్ని అసలు ఎపుడు రిలీస్ అయ్యాయో ఎపుడు థియేటర్స్ నుండి వెళ్లిపోయాయో తెలియని పరిస్థితి నెలకొంది.

ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21F లాంటి సినిమాలు రాజ్ తరుణ్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. కానీ ఇటీవలే రాజ్ తరుణ్ నటించిన సినిమాలు అన్ని బాక్సఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. దాంతో మంచి బ్యానర్, కథ, డైరెక్టర్ సెట్ అవుతే రెమ్యూనరేషన్ తక్కువ అయినా పర్లేదు అని అంటున్నాడు. ఎంత తక్కువ మనీ ఇచ్చినా తనకు ఒక మంచి ఇస్తే చాలని ఈ హీరో చెబుతున్నట్లు సినీ ఇండస్ట్రీలో టాప్ నడుస్తోంది.

అలానే హీరో శ్రీవిష్ణు పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ సంవత్సరం శ్రీవిష్ణు నటించిన సినిమాలు ఏవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి. మంచి బ్యానర్‌లో అవకాశం వస్తే రెమ్యూనిరేషన్ తగ్గించుకువడానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు శ్రీవిష్ణు. ఇక నాగశౌర్య అదే రూట్ లో వెళ్తున్నాడు. నాగశౌర్యా నటించిన ‘కృష్ణ వ్రింద విహారి ‘సినిమా ఉహించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అలానే ఆది, సాయి కుమార్, కిరణ్ అబ్బవరం సినిమాలు కూడా బాక్సఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. దాంతో ఈ హీరోలు రెమ్యూనిరేషన్ ని తగ్గించుకుంటుంటే సక్సెస్ సాధించి ఇండస్ట్రీలో తమ మనుగడ నిలుపుకోవచ్చని అనుకుంటున్నాడు.