ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ `పుష్ప` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది.
తొలిత ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ.. అదే చివరకు పాజిటివ్‌గా మారింది. దాంతో విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ చిత్రం రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా `పుష్ప 2` రాబోతోంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పుష్ప 3 కూడా ఉంటుందట. సుకుమార పుష్ప మూడో భాగాన్ని కూడా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట.
పుష్ప లో ఒక సాధారణ కూలీ స్మగ్లర్ గా ఎలా ఎదిగాడు అన్నది చూపించాడు. ఇక సెకండ్ పార్ట్ లో అతని రూలింగ్ తో పాటుగా అతని డౌన్ ని చూపిస్తారట. ఇక పార్ట్ 2 చివర్లో పార్ట్ 3 కి సంబంధించిన క్లూ వదిలి ముగిస్తారట. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే.. పుష్ప 3ని ఇప్పుడే కాకుండా నాలుగైదు ఏళ్లు గ్యాప్ తీసుకుని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని సుకుమార్ భావిస్తున్నారట. ఈలోగా సుకుమార్ మరో రెండు సినిమాలు పూర్తి చేయాలని కమిట్ అయ్యాడంటూ టాక్ నడుస్తోంది.