పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ దర్శకుడు మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించారు. సైలెంట్ గా మారుతి షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘రాజా డిలక్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా కథ మొత్తం `రాజా డిలక్స్` అనే పాత థియేటర్ చుట్టూ తిరుగుతుంది.
ఇదే కథకి హార్రర్ కమెడీ టచ్ అప్ ఇచ్చి మారుతి తన శైలిలో తెరకెక్కించనున్నట్లు ప్రచారం సాగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అలాగే ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.
అదేంటంటే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన `ఆచార్య`తో ఈ సినిమాకు ఓ లింక్ ఏర్పడింది. అదెలా ఉంటే.. ఆచార్య కోసం వేసిన ధర్మస్థలి సెట్ గుర్తిండే ఉంటుంది. ఆచార్య షూటింగ్ సగానికి పైగా అక్కడే చిత్రీకరించారు. అయితే ధర్మస్థలి సెట్‌లో ఇప్పుడు ప్రభాస్ – మారుతి సినిమా షూటింగ్ జరుగుతోంది. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఆ సెట్ లో చిత్రీకరిస్తున్నారట. ఇప్పుడీ విషయమే ఫ్యాన్స్‌కు ఆందోళనకు గురి చేసింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆచార్య బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఎక్కడ ఆ సినిమా సెంటిమెంట్ ప్రభాస్-మారుతి మూవీకి రిపీట్ అవుతుందో అని అభిమానులు కలవరం చెందుతున్నారు.