అందాల తార శ్రుతిహాసన్ గత రెండేళ్ల నుంచి డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరి రిలేషన్ బహిరంగ రహస్యమే. ముంబైలో ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కుతారని అందరూ భావించారు. కానీ వీరిద్దరూ విడిపోయారంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
`నాలా నేను.. నాతో నేను.. ఉంటేనే నాకు బాగుంటుంది.. నాతో నేనే సరదాగా ఉండగలను.. నా టైం విలువ నాకు తెలుసు.. నా జీవితాన్ని నేను ఇష్టపడుతున్నాను అనేది నేను రియలైజ్ అయ్యాను` అంటూ రీసెంట్ గా శ్రుతి హాసన్ ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ తో ఆమె బ్రేకప్ వార్తలు తెరపైకి వచ్చాయి. శాంతనుతో శ్రుతి విడిపోయిందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇలాంటి తరుణంలో శ్రుతి హాసన్ మిడిల్ ఫింగర్ చూపిస్తూ దిగిన ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఫారిన్ బాడీ లాంగ్వేజ్ లో మిడిల్ ఫింగర్ చూపించడం పెద్ద బూతు. దీంతో శ్రుతి ఇలా మిడిల్ ఫింగర్ చూపించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే శాంతనుతో ఆమె విడిపోలేదని.. ఇలాంటి ఫేక్ వార్తలు రాసే వాళ్ళకి మిడిల్ ఫింగర్ చూపించి శ్రుతి బోల్డ్ ఆన్సర్ ఇచ్చిందని అంటున్నారు.