రఘువరన్ జీవితం ఆ హీరోయిన్ వల్లే ఇలా మారిందా..!!

అప్పట్లో విలన్ పాత్రలు అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది నటుడు రఘువరన్ మాత్రమే.. కేవలం తన మాటలతోనే ప్రతి ఒక్కరిని భయపెట్టించగల విలక్షణమైన నటుడుగా పేరుపొందారు రఘువరన్. ఇక ఆయన నటన అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఈయన ఎక్కువగా విలన్ పాత్రలోనే నటించాడు. తెలుగు, తమిళ్ ,మలయాళం ,కన్నడ, హిందీ వంటి భాషలలో దాదాపుగా 200 పైగా సినిమాలలో నటించి మెప్పించారు రఘువరన్.

Actress Rohini slams media intrusion as husband Raghuvaran lay dead
రఘువరన్ కేరళ ప్రాంతానికి చెందిన వ్యక్తి..మొదట కన్నడ సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ఉండగా తెలుగులో పలు విభిన్నమైన పాత్రలలో నటిస్తూ అంచలంచలుగా ఎదిగారని చెప్పవచ్చు. ఇక 1979లో చెన్నైలో యాక్టింగ్ గ్రూపులో సభ్యుడిగా చేరారు. 1996లో ప్రముఖ నటి డబ్బింగ్ ఆర్టిస్ట్ రోహిణి వివాహం చేసుకున్నారు .వీరికి ఒక కుమారుడు కూడా జన్మించారు. అయితే కొన్ని కారణాల చేత 2004లో వీరిద్దరూ విడిపోవడం జరిగిందట. ఆయన తెలుగులో సుస్వాగతం నాగ, జానీ, శివ తదితర చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

Suresh Krissna's moving tribute to actor Raghuvaran - The Hindu

రఘువరన్ 2008 మార్చి 19న మరణించారు. రఘువరన్ మద్యానికి, డ్రగ్స్ కు అలవాటు పడడం వల్ల చనిపోయారని వార్త వైరల్ గా మారుతూ ఉంటుంది. అప్పట్లో రఘువరన్ ఒక స్టార్ హీరోయిన్ ని చాలా ఇష్టపడ్డారట కానీ ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదని బాధతో డ్రగ్స్ మద్యానికి బానిస అయ్యి మరణించాలనే వార్తలు ఇప్పటికీ వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఆ స్టార్ హీరోయిన్ మాత్రం తన సహనటుడిని వివాహం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రఘువరన్ కు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.