కుర్రాళ్లను చెడ‌గొట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న కృతి స‌న‌న్‌.. కాలు పైకెత్తి మ‌రీ పోజులు!

కృతి సనన్.. ఈ అమ్మడి కెరీర్ ప్రారంభమైంది టాలీవుడ్ లోనే అయినా బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అక్కడ క్రేజీ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. ఇక చాలా కాలం తర్వాత కృతి సన‌న్‌ తెలుగులో `ఆదిపురుష్‌` సినిమాకు సైన్ చేసింది.

ప్రభాస్ ఇందులో హీరోగా నటించ‌గా.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ మూవీని తెరకెక్కించాడు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

వచ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సంగతి పక్కన పెడితే.. కృతి స‌న‌న్ లేటెస్ట్ ఫోటోషూట్ నెట్టింట మంట‌లు రేపుతున్నాయి. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోషాట్ల‌తో అంద‌రి మ‌తులు చెడగొట్టే కృతి స‌న‌న్‌.. తాజాగా మరోసారి తన అందాలతో వ‌ల వేసింది.

బ్లాక్ క‌ల‌ర్ లెద‌ర్ డ్రెస్ లో అందంగా ముస్తాబై హాట్ హాట్ గా ఫోటో షూట్ చేసింది. కాలు పైకెత్తి మరి కొంటెగా ఫోటోలకు పోజులు ఇచ్చింది. ప్రస్తుతం కృతి లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ పిక్స్ ను చూసిన నెటిజ‌న్లు.. కుర్రాళ్ల‌ను చెడ‌గొట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం కృతి స‌న‌న్ లేటెస్ట్ పిక్స్ పై మీరు ఓ లుక్కేసేయండి.