విజ‌య్ వ‌ర్సెస్ అజిత్‌.. ఇద్ద‌రితో ఎవ‌రు పెద్ద స్టారో తేల్చేసిన త్రిష‌!

కోలీవుడ్ లో స్టార్ హీరోలు విజయ్ దళపతి, అజిత్ కుమార్ మధ్య సంక్రాంతి ఫైట్ నడవబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ `వార‌సుడు` సినిమాతో రాబోతుంటే.. అజిత్ `తునివు` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. రెండు సినిమాల పైన భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇటీవల వార‌సుడు నిర్మాత దిల్ రాజు ఓ భేటీలో అజిత్‌ కంటే విజయ్ పెద్ద స్టార్ హీరో అని, కాబట్టి తమిళనాడులో తమ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలంటూ వ్యాఖ్యానించాడు.

ఈయ‌న వ్యాఖ్య‌లు కోలీవుడ్లో తీవ్ర దుమారం రేపాయి. అజిత్ ను ఎలా తక్కువ చేసి మాట్లాడతారు అంటూ ఆయన అభిమానులు దిల్ రాజు పై తీవ్ర ఎత్తైన ధ్వజమెత్తారు. ఇక అప్పటి నుంచి విజయ్ అజిత్ లలో ఎవరు నంబ‌ర్ 1 హీరో అన్న చర్చ జోరుగా నడుస్తోంది. ఇదే ప్రశ్న తాజాగా ప్ర‌ముఖ హీరోయిన్ త్రిషకు ఎదుర‌వ‌గా.. ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

`నంబర్స్‌ గేమ్‌ను నేను వ్యక్తిగతంగా అసలు నమ్మను. ఇది కేవలం ఒకరి చివరి సినిమాను బట్టి మాత్రమే లెక్కిస్తారు. చివరి సినిమా హిట్‌ అయితే అతన్నే నంబర్‌ 1 అంటారు. కొన్ని రోజులుగా రిలీజ్‌లు లేకపోతే ఆ స్థానంలో మరొకరు వస్తారు. ఇక నేను సినిమాల్లోకి రాక ముందు నుంచే విజయ్‌, అజిత్‌లు సినిమాల్లో ఉన్నారు. ఇద్దరూ పెద్ద సూపర్‌స్టార్లే. వాళ్లలో ఎవరు పెద్ద అంటే నేనెలా చెప్పగలను` అంటూ త్రిష పేర్కొంది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.