వీరయ్య చిత్రానికి ఆసన్నివేశం హైలెట్గా మారనుందా..!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం అక్కడక్కడ ప్యాచ్ వర్క్ లు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. మరొకవైపు సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సెరవేగంగా జరుగుతున్నాయి. దీంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే జనవరికి విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి దర్శకుడు బాబి దర్శకత్వం వహించారు. బాబి అభిమానులలో ఇంట్రాక్షన్లు చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉన్నాయి.

Has Chiranjeevi started filming for 'Mega 154' in Hyderabad?ముఖ్యంగా వీరయ్య సినిమాలోని ఇంట్రడక్షన్ సన్నివేశం తుఫాన్లో చిత్రీకరించాల్సి వచ్చింది. వర్షం భారీగా పడుతూ ఉండడంతో పాటు విపరీతమైన గాలి ఎఫెక్ట్ల లో చిత్రీకరణ చేసినట్లుగా డైరెక్టర్ తెలియజేశారు. చిరంజీవి గారు తలుచుకుంటే ఇలాంటి సన్నివేశాలను డుప్ లో అయినా చేయవచ్చు. చివరిలో మాత్రం తన ఫేస్ ను ఒక్కటి చూపించవచ్చు. కానీ చిరంజీవి గారు మాత్రం మొత్తం సన్నివేశంలో తానే నటించారు అసలు ఎక్కడ కూడా డూపు ఉపయోగించలేదని తెలిపారు. ఆయన తడి జుట్టుతో తడి శరీరంతో ఆ చలి గాలిలో షూటింగ్ పాల్గొన్నారు. అందుకే ఆయన మెగాస్టార్ అంటారని తెలిపారు బాబి.

Waltair Veerayya Release Date - Movie News

ఈ సినిమా కోసం 30 ఏళ్ల యువకుడిగా చిరంజీవి చాలా కష్టపడ్డారని మంచు కురుస్తున్న చోట శ్రీదేవి పాట చిత్రీకరణ కోసం చిరంజీవి చాలానే కష్టపడ్డారని తెలిపారు. సినిమాలోని ఇంట్రడక్షన్ సన్నివేశం కోసం అలానే కష్టపడ్డామని తెలిపారు బాబి .ఈ సినిమాకి ఇదే హైలెట్ గా మారుతుందేమో చెప్పలేము అని కూడా తెలిపారు. ఇక ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. కీలకమైన పాత్రల రవితేజ నటిస్తున్నారు. మరి ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.