కొరటాల – ఎన్టీఆర్ మూవీ నుంచి ఊహించని లేటెస్ట్ అప్డేట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత తన తదుపరి సినిమాని స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయి దాదాపు సంవత్సరం కావస్తున్న.. ఇప్పటికీ కొరటాల ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు.. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనిలోనే బిజీగా ఉన్నాడు. తాజా సమాచారం ఏమిటంటే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను వచ్చే జనవరి నెల సంక్రాంతి నుంచి మొదలు పెట్టనున్నారు అని తెలుస్తుంది.

ఇప్పటికే కొరటాల ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించారట. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ కన్ఫర్మ్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. సినిమాలో ఎన్టీఆర్‌కు ప్రతి నాయకుడిగా బాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నాడు అంటూ తెలుస్తుంది. ఇప్పటికే ఆ బాలీవుడ్ హీరో ప్రభాస్- మహేష్ బాబు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.

ఎన్టీఆర్ సినిమాల్లో కూడా అతను నటించబోతున్నాడు. ఆ బాలీవుడ్ స్టార్ హీరో మరి ఎవరో కాదు సైఫ్ అలీ ఖాన్.. ప్రభాస్ హీరోగా వస్తున్న ఆది పురుష్‌ సినిమాలో రావణాసుడిగా సైఫ్ నటిస్తున్నాడు. త్రివిక్రమ్- మహేష్ బాబు సినిమాలో కూడా నటించబోతున్నాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు కొరటాల- ఎన్టీఆర్ కోసం సైఫ్ అలీ ఖాన్ నీ ఈ సినిమాలోకి తీసుకొస్తున్నాడు. ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమామా కొరటాల పాన్ ఇండియా లెవెల్ లో అదిరిపోయే రీతిలో తెరకెక్కించబోతున్నాడు.

Prabhas Villain Becomes NTR Villain? | cinejosh.com

దానికి అనుగుణంగా కొరటాల నటీనటుల ఎంపిక చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ సినిమాలో చేయడానికి ఒప్పుకుంటే మాత్రం ఈ సినిమాకు బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అవుతాయని కచ్చితంగా చెప్పొచ్చు. ఈ విషయంలో ఎంతవరకు నిజమందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.