బాలయ్య షో కి పవన్ వచ్చేస్తున్నారా..షూటింగ్ ఆ రోజే..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ షో మొదటి సీజన్ మించి రెండో సీజన్ అదిరిపోయే రీతిలో దూసుకుపోతుంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకున్న ఈ షో న్యూ ఇయర్ సందర్భంగా ప్రభాస్- గోపీచంద్ ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది.

ఆ ఎపిసోడ్ కోసం టాలీవుడ్ మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంది. ఇప్పుడు మరో క్రేజీ కాంబోకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. బాలయ్య అన్ స్టాపబుల్ షో కి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా రాబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు ఆ ఎపిసోడ్ కు సంబంధించి క్లారిటీ వచ్చేసింది.

Unstoppable With NBK 2 Update Nandamuri Balakrishna To Interview Pawan  Kalyan Trivikram For Unstoppable 2 First Episode Update | Unstoppable With  NBK 2 : పవన్ కళ్యాణ్‌ను బాలకృష్ణ ఇంటర్వ్యూ చేస్తే...

ఈనెల 27వ తారీకు నుంచి పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టబోతున్నారని ఆహా తాజాగా అప్డేట్ ఇచ్చింది. ఈ షో షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ తను తాజాగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మరి బాలయ్య షో కి వస్తున్నాడట.
ఈ షోలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తో పాటు దర్శకుడు క్రిష్ కూడా ఆ ఎపిసోడ్ లో కాసేపు అలరించబోతున్నారని కూడా తెలుస్తుంది.

After Prabhas, It's Pawan Kalyan On Unstoppable!

ఆ ఎపిసోడ్‌లో బాలకృష్ణ- పవన్ కళ్యాణ్ ను ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు అనేది ఎప్పుడూ ఎంతో ఆసక్తికరంగా మారింది. బాలకృష్ణ ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఆన్సర్ చెప్తారో తెలియాలంటే ఈ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే. మెగా నందమూరి అభిమానులకు ఇది సంక్రాంతి పండగను మించిన పెద్ద పండుగ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.