`18 పేజెస్‌` ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. ఇంకా రాబ‌ట్టాల్సింది చాలా ఉంది?!

యంగ్ అండ్ టాలెంటెడ్‌ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఫీల్ గుడ్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ `18 పేజెస్‌`. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించాడు. డిసెంబ‌ర్ 23న విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది.

 

అయితే టాక్ బాగున్నా.. పోటీగా ర‌వితేజ న‌టించిన ధ‌మాకా ఉండ‌టంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎక్కువ ప్ర‌భావం చూపించ‌లేక‌పోతోంది. ఇక మూడో రోజు మాత్రం సండే కావ‌డంతో మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 1.5 కోట్లు, రెండో రోజు రూ.1.06 కోట్ల షేర్ వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. 3వ రోజు అంత‌కు మించి రూ. 1.45 కోట్ల రేంజ్ లో షేర్ ని ద‌క్కించుకుంది. వరల్డ్ వైడ్ గా రూ. 1.77 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఏరియాల వారీగా 18 పేజెస్ 3 డేస్ టోట‌ల్ వ‌సూళ్ల‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 2.03 కోట్లు
సీడెడ్: 40 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 45 ల‌క్ష‌లు
తూర్పు: 28 ల‌క్ష‌లు
పశ్చిమ: 15 ల‌క్ష‌లు
గుంటూరు: 18 ల‌క్ష‌లు
కృష్ణ: 14 ల‌క్ష‌లు
నెల్లూరు: 10 ల‌క్ష‌లు
———————————–
ఏపీ+తెలంగాణ = 3.73 కోట్లు(7.15 కోట్లు~ గ్రాస్‌)
———————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా – 40 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్ – 65 ల‌క్ష‌లు
—————————————–
వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్ = 4.78 కోట్లు(9.50 కోట్లు~గ్రాస్)
—————————————–

కాగా, రూ. 12.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా.. మొద‌టి మూడు రోజులు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 7.72 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్‌గా నిల‌వాలంటే ఈ సినిమా ఇంకా చాలా రాబ‌ట్టాల్సి ఉంది.